telangana: డియర్ హైదరాబాదీస్ ...చికెన్ మానేయండి..బర్ల ప్లూ తో రెడ్ జోన్ లో ఉంది !


 అధికారులు టెస్టులు చేయించారు. ల్యాబ్ నుంచి వచ్చిన టెస్టు ఫలితాల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ ఫామ్స్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి ఫౌల్ట్రీ నుంచి గుడ్లు కాని కోళ్లు కాని అమ్మకూడదని తెలిపారు.


Published Apr 03, 2025 11:17:00 AM
postImages/2025-04-03/1743659461_BIRDFLU41200x720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  తెలంగాణలో బర్డ్ ఫ్లూ మళ్లీ బయపెడుతుంది. హైదరాబాద్ నగరశివారు ప్రాంతాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలుప్రాంతాల్లో బర్డ్ ప్లూ కారణంగా వేలాది కోళ్లు చనిపోయాయి. హైదరాబాద్ నగర శివార్లో ఓ ఫౌల్ట్రీ ఫారమ్ లో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేగుంది. గత నాలుగు రోజుల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. 


 అధికారులు టెస్టులు చేయించారు. ల్యాబ్ నుంచి వచ్చిన టెస్టు ఫలితాల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ ఫామ్స్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి ఫౌల్ట్రీ నుంచి గుడ్లు కాని కోళ్లు కాని అమ్మకూడదని తెలిపారు.మరోవైపు ప్రస్తుతం బర్డ్ ఫ్లూగా నిర్దారణ అయిన అబ్దుల్లా పూర్ మెంట్ ఫౌల్ట్రీ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆయా పామ్స్ లో ఉన్న కోళ్లను అధికారులు జాగ్రత్తగా పూడ్చి పెట్టారు. ఆ ప్రాంతంలో ఐదు కిలోమీటర్లు వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు.


గా ఉడికించిన చికెన్, కోడిగుడ్లు తినడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు ఏమాత్రం లేవని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. మనుషులకు బర్డ్ ఫ్లూ రాదు.  ఈ వ్యాధి వస్తే జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితోపాటు కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాని ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వచ్చి ఓ చిన్నారి చనిపోయింది . కాబట్టి కొన్ని రోజులు చికెన్ కు ఎగ్స్ కు దూరంగా ఉండడమే మంచిందంటున్నారు డాక్టర్లు.కోళ్ల ఫారమ్ లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, ఎన్ 95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu chicken birds telangana

Related Articles