War: ఎమ్మెల్యే కాలే, ఎమ్మెల్సీ మహేందర్ మధ్య మాటల యుద్ధం 2024-06-26 17:30:26

న్యూస్ లైన్ డెస్క్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రసాభాస నెలకొంది.  ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ భవన నిర్మాణానికి కేవలం రూ.10కోట్లు ఇస్తున్నట్లు కాగీతం మాత్రమే ఇచ్చారన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న యాదయ్య మాట్లాడి నిధులు తీసుకొస్తే బాగుండేదని అన్నారు. ఇప్పుడు నాపై దొబ్బిండ్రు అయినా పర్వాలేదు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చోరవతో బిల్డింగ్ పూర్తి చేసింది. అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పూర్తి చేస్తామని మాట్లాడగా కాలే యాదయ్య స్పీకర్ అనుమతితో మాట్లాడుతూ ఎదో కాగీతం అంటుండ్రు ఆ కాగీతం ఎదోచూపిస్తే బాగుంటుందన్నారు. అయినా కాంట్రాక్టు మీరే నిధులు, మీకే వస్తాయంటూ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలగజేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మహేందర్ రెడ్డి కాలే యాదయ్యను ప్రశ్నించగా ఏ మాట్లాడోద్ధా‌ అంటూ యాదయ్య నిలదీశారు. అయితే ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా స్పీకర్ ప్రసాద్ కుమార్ కలుగజేసుకొని సముదాయింపు చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండానే హాడావుడిగా ప్రారంభోత్సవం చేయడంతోనే ఈ మాటల యుద్ధానికి కారణమని తెలుస్తోంది.