Kaushik Reddy: స్పీకర్‌ను కలవడానికి వస్తే.. అందుబాటులోకి రాలే

ప్రొటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారులపై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవడానికి అసెంబ్లీకి వస్తే.. స్పీకర్ అందుబాటులోకి రాలేదు


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720179857_padi.jfif

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ శుక్రవారం స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ మాకు ఉదయం 11 గంటలకు టైం ఇచ్చారు. ఒంటి గంట దాకా స్పీకర్ కోసం ఎదురు చూశామన్నారు. కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పీకర్ అందుబాటులోకి రాలేదన్నారు. కరీంనగర్ జిల్లాల్లో అధికారులు యథేచ్ఛగా ప్రోటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. కరీంనగర్  డీఈవో, జడ్పి సీఈవో పై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవాలని వచ్చాము. డీఈవో,  జడ్పి సీఈవో పై చర్యలు తీసుకునే దాకా నిద్రపోనాని ఆయన తెలిపారు. 

ప్రజల తరపున పోరాడటం చేసిన తప్పా ఏ తప్పు చేయలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే కోర్టు మొట్టి కాయలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదన్నారు. అధికారుల తీరు వల్ల కల్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతున్నాయిని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటో కాల్ ఉల్లంఘనలపై స్పందించాలని డిమాండ్ చేశారు. తను విద్యా శాఖపై రివ్యూ మీటింగ్ పెడితే తనపైనే కాంగ్రెస్ క్రిమినల్ కేసు పెట్టిందని ఆయన అన్నారు. తన మీద కేసులు పెడితే భయపడే వాడిని కాదని, జైలుకు పోవడానికి కూడా సిద్ధమని తెలిపారు. నేను కేసీఆర్ శిష్యుడిని కాంగ్రెస్ ఇట్లాంటి 100 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆవసరమైతే ముఖ్యమంత్రి కాన్వాయికే అడ్డం తిరుగుతామని, అప్పుడు ఏం చేస్తారో చేసుకోండని కాంగ్రెస్‌కు సహల్ విసిరారు. కచితంగా డీఈవో, జడ్పి సీఈవోపై ప్రివిలెజి మోషన్ ప్రవేశ పెడతామని  కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ప్రొటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారులపై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవడానికి అసెంబ్లీకి వస్తే.. స్పీకర్ అందుబాటులోకి రాలేదని తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయిని, అక్కడ కాంగ్రెస్ నేతల పెత్తనం నడుస్తోందని ఆమె ఆరోపించారు. స్పీకర్ మళ్ళీ ఎపుడు టైమ్ ఇస్తే అపుడు కలిసి ప్రివిలేజి మోషన్ ఇస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడారు. విప్ ఆది శ్రీనివాస్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ ను తిడితే గొప్ప నాయకుడు కాలేరని, అధికారం ఉందని విర్ర వీగొద్దని అన్నారు. కేసీఆర్ ఉద్యమం చేసినపుడు ఆది శ్రీనివాస్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో వరద కాలువ సమస్యలు ఉన్నాయిని ముందు వాటి గురించి పట్టించుకోవాలని సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs padi-koushik-reddy assembly

Related Articles