KTR:  కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించలే

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.


Published Jul 24, 2024 05:40:05 AM
postImages/2024-07-24/1721817273_tktr.PNG

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని మేము చెబుతున్నదే ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు అక్కడ ఉండి చెప్పారు. అసెంబ్లీలో ఉన్న నాయకులకు సమాధానం చెప్పటానికి కేసీఆర్ అవసరం లేదన్నారు. తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వం తీర్మానం అని చెబుతూ దాని కాపీలను మాత్రం మాకు ఇవ్వలేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ పదాన్ని నిషేధించినట్లే ఇప్పుడు లోక్‌సభలో తెలంగాణ పదాన్ని నిషేధించారని తెలిపారు. బీఆర్ఎస్ జెండా లేకపోవటం కారణంగానే లోక్‌సభలో తెలంగాణ అనే పదం నిషేధించబడిందన్నారు. ఇప్పుడు 8+8 అంటే గుండు సున్నా అనే పరిస్థితిని తెచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా మనకు జరిగిన అన్యాయాన్నే కేంద్రం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరగటంపై మోడీతో కేసీఆర్ సఖ్యతతో లేకపోవటం కారణంగానే జరిగిందని సీఎం అంటున్నారు. తము సఖ్యతతో ఉంటామని అంటూ హైదరాబాద్‌లో ప్రధాని మోడీని బడే భాయ్ అని రేవంత్ రెడ్డి సంబోధించారు. కానీ బీఆర్‌ఎస్ గతంలో చెప్పిందే మీకు ఇప్పటికీ అర్థం అయ్యింది. ఏమీ చేసిన సరే వాళ్లది తెలంగాణకు అన్యాయం చేయాలన్న తత్వమే ఉందని, కాంగ్రెస్‌కు ఇప్పుడు బోధపడిందన్నారు.



కేంద్రం సహకరించకపోయినా సరే బీఆర్‌ఎస్ చాలా సాధించింది. కానీ కాంగ్రెస్ లాగా చేయని పనులకు క్రెడిట్ తీసుకోలేదని కేటీఆర్ అన్నారు. తము తెచ్చిన, చేసిన పనులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని ఆరోఫించారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు మేలు చేయాలన్నారు. పక్క రాష్ట్రానికి సాయం చేస్తే బాధ లేదు కానీ మనకు నిధులు ఇవ్వకపోవటం బాధగా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లు ఎవరైనా సరే వాళ్ల మెడలు వంచేందుకు బీఆర్ఎస్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన వెంటనే అన్యాయంగా అనాడు ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. అప్పుడు ముందుగా నిరసన తెలిపింది కేసీఆర్ అని, రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణకు ప్రత్యేక స్టేటస్ అడిగింది కూడా కేసీఆర్ అని, లక్ష కోట్లకు పైగా ఆర్థిక సాయం కావాలని కోరారు. ప్రతి విషయంలో సాయం కోసం కేంద్రం దగ్గరకు ఎన్నోసార్లు వెళ్లి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని సాధించాము, కొన్ని సాధించలేకపోయామని తెలిపారు. యాచిస్తే కాదు శాసిస్తేనే ఏదైనా సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పేవారు. ఇప్పుడు అదే ఆలోచన చేయాలని నేను ప్రజలను కోరారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా సరే బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

newsline-whatsapp-channel
Tags : india-people brs congress ktr unionbudget

Related Articles