Vivekanand: ప్రజలకు ఏం కావాలో సీఎం రేవంత్‌కి క్లారిటీ లేదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721040736_viv2.jfif

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. హైడ్రా ఏర్పాటును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, స్థానిక సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. అధికార వికేంద్రీకరణ చేయాల్సిందని, అధికార కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలు, అవినీతి చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, మూడు కార్పోరేషన్స్ చేసి అధికారాన్ని చెలాయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. 2007 తర్వాత శివారు ప్రాంతంలో వున్న 12 మున్సిపాలిటీలను గ్రేటర్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఇప్పుడు శివారు ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. శివారు ప్రాంతాల విలీనాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, శివారు ప్రాంతాలను విలీనం చేసేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. 

రింగ్ రోడ్డు మొత్తాన్ని గ్రేటర్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందని, బీఆర్ఎస్ హయాంలో మంచిగా పని చేశాం కాబట్టే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. గ్రేటర్ పరిధిలో పారిశుధ్యం లోపించింది, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి శివారు ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల క్రితమే మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి అన్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు కాబట్టి ఎన్నికలను కాలయాపన చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముంబై నగరంలో మొత్తం తొమ్మిది మున్సిపల్ కార్పోరేషన్లు ఉన్నాయి అని, రోజురోజుకు హైదరాబాద్ నగర ఇమేజ్ పడిపోతుందన్నారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దివాలా తీసింది కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో హైదరాబాద్‌కు ఒక్క కంపెనీ రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్ రియాల్టీ తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి మారువేషంలో ప్రజల వద్దకు వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ పెట్టుబడులకు అగ్రగామిగా ఉండేదని, తమ పాలన మంచిగా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్ రెడ్డి అనడం శుద్ధ తప్పు అన్నారు. అసలు రేవంత్ ఏం చేయడం లేదని, సినిమా తీయకుండానే త్రీడీ సినిమా చూపుతున్నారన్నారు. 

సీఎం కావాలనుకున్నారు కానీ సీఎం అయ్యాక ఏం చేయాలన్న దానిపై రేవంత్‌కు స్పష్టత లేదన్నారు. ఏడు నెలలైనా ప్రభుత్వం టేకాఫ్ కాలేదని, రేవంత్ పాలనలో అన్నీ కుంటుపడ్డాయి అన్నారు. కొందరు పెట్టుబడిదారులు పక్కరాష్ట్రం వైపు చుస్తున్నారని, హైడ్రా ఆలోచన మాని త్వరలో గడువు ముగియబోతున్న హైదరాబాద్ శివారు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని, గత పాలకుల అభివృద్ధిని బీఆర్ఎస్ కొనసాగించిందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కొనసాగించడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని ఆరోపించారు. తను కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని పిటీషన్ వేశానని, ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నారని అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని సీఎం అంటున్నారు కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదన్నారు. తను కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తను విజయం సాధించింది గుర్తు చేశారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయనని, ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషిస్తా తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పది ఏళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కొనసాగించలేకపోతుందని, సీఎం రేవంత్ రెడ్డికి మంచి అవకాశం వచ్చిందన్నారు. తను మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని వివేకానంద సూచించారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs cm-revanth-reddy kpvivekgoud

Related Articles