ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కి ఊరట లభించింది. ఢిల్లీలో నేషనల్ అవార్డు అందుకోవాల్సింది ఉందని.. అందుకు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సింది కోర్టును కోరారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ సినిమా ఇండస్ట్రీ కి ఏమైందో ఏమో.. అన్ని ఇండస్ట్రీల్లోను ఈ కాస్టింగ్ కౌచ్ గోలనే. రీసెంట్ గా జానీ మాస్టర్ రచ్చ అందరికి తెలిసిందే . అయితే ఎట్టకేలకు సారుకు బెయిల్ దొరికింది. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన యువతి.. జానీ మాస్టర్ పై లైంగిక, అత్యాచార ఆరోపణలు చేసింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం చెంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే సారు నేషనల్ అవార్డు తీసుకోవాలి ...బెయిల్ కోరారు జానీ మాస్టర్ తరుపు న్యాయవాది.
ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కి ఊరట లభించింది. ఢిల్లీలో నేషనల్ అవార్డు అందుకోవాల్సింది ఉందని.. అందుకు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సింది కోర్టును కోరారు . తప్పు నిర్ధారణ కాలేదు కాబట్టి ఈ నెల 6 నుంచి 10 వతేదీ వరకు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కించిన తిరు మూవీలో మేఘం కరుకత.. పాటలకు ఉత్తమ కొరియోగ్రఫి అవార్డు ప్రకటించారు.
జానీ మాస్టర్ దాఖలు చేసిన జనరల్ బెయిల్ పిటిషన్ పై నార్పింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ఇబ్బందిపెట్టే అవకాశముందని తెలిపారు. అయితే విచారణ టైంలో బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. కాని కోర్టు నేరం రుజువు కాకుండా జానీ మాస్టర్ పేరు ప్రఖ్యాతలు దెబ్బతీసే పనులు చేసే హక్కు ఎవ్వరికి లేదని తెలిపారు.