డీలిమిటేషన్ పై కాంగ్రెస్ డబుల్ డ్రామా...!


Published Mar 23, 2025 11:12:00 AM
postImages/2025-03-23/1742708520_WhatsAppImage20250323at11.04.22AM.jpeg

డీలిమిటేషన్ పై
కాంగ్రెస్ డబుల్ డ్రామా 
సౌత్ స్టేట్ కాంగ్రెస్ డీలిమిటేషన్ కు వ్యతిరేకం
కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తటస్థ వైఖరి
మల్లగుల్లాలు పడుతున్న హస్తం పెద్దలు
దేశానికి 36 శాతం జీడీపీని ఇస్తున్న సౌత్ స్టేట్స్
సౌత్ కు జరుగుతున్న అన్యాయంపై మౌనమెందుకు ?
స్టాలిన్ మీటింగ్ కు వెళ్లిన కాంగ్రెస్ పాలిత ప్రతినిధులు
తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక నుంచి డీకే

ఏ పార్టీకి అయినా ఒకే స్టాండ్ ఉంటుంది. అయితే ఎస్. లేదంటే నో. కానీ.. డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దక్షిణ భారతదేశ కాంగ్రెస్ నాయకులు డీలిమిటేషన్ కు వ్యతిరేకం. అల్రెడీ స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఏసీ మీటింగ్ కు కూడా సౌత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. కానీ.. అదే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీలిమిటేషన్ విషయంలో తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తుండటంతో రాజకీయ వర్గాలో చర్చ మొదలైంది. 

తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 22) :

రాజ్యాంగం ప్రకారం వచ్చే సంవత్సరం లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. అందుకోసం మోదీ సర్కార్ సర్వం సిద్దం చేసింది. అయితే పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందుని తమిళనాడు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఈ విషయంపై మాట్లాడటానికి మార్చి 22న దక్షిణాది రాష్ట్రాల సీఎంతో భేటీ నిర్వహించారు. అయితే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మాత్రం డీ లిమిటేషన్ విషయంలో తమ వైఖరిని ప్రకటించకుండా..మౌనం వహించడం చర్చనీయాంశమైంది.మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులను పంపించి..ద్వంద్వ వైఖరిని అవలంభించడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాదిలో తమ ప్రాబల్యం తగ్గుతుందనే బీజేపీ డీ లిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చి..రాబోయే రోజుల్లో దక్షిణాదిపై పట్టు సాధించడానికే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పెద్దల అంతర్గతంగా చెప్పుకొస్తున్నారు. దీంతో తమ వైఖరిని ప్రకటించకుండా మౌనంగా ఉండాలనే దోరణిలో ఢిల్లీ పెద్దలున్నట్లు సమాచారం. ఒకవేళ డీ లిమిటేషన్ ప్రక్రియ అమలు జరిగితే ..ఉత్తరాదిలో బీజేపీ బలహీనమైతే..తాము బలపడవచ్చనే దోరణితో కాంగ్రెస్ ఆలోచిస్తుందా..? అనే ప్రచారం జరుగుతోంది..?

కాంగ్రెస్ వైఖరి ఏమిటి..?:

డీ లిమిటేషన్ ప్రక్రియతో ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ రాజకీయ వ్యూహంతో సమతుల్యం చేయడంపై ఉన్న సవాల్లను తేటతెల్లం చేశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రస్తుతం ఒక అనిశ్చిత స్థితిలో ఉంది. చారిత్రతాత్మకంగా, భాషా వైవిధ్యాన్ని సమతుల్యం చేయడానికి కాంగ్రెస్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేసింది. కానీ ఈ విధానం హిందీ బెల్ట్- దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఉత్తర భారత రాష్ట్రాలకు అనుగుణంగా ఉండే  డీ లిమిటేషన్ విభజన ను దక్షిణాది రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి అంగీకరిస్తే ఉత్తరాదిన బలహీనమవుతామనే దోరణిని కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దక్షిణాది నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెండు నాల్కల దోరణితో కాకుండా ..డీ లిమిటేషన్ పై తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ కూడా ఓట్ల కుట్రలు చేస్తుందా..?

జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందనే విమర్శలున్నాయి.  అయితే దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ  తమ స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పడం లేదు. డీ లిమిటేషన్ కు అనుకులమా.? లేదంటే వ్యతిరేకమా..? తెలియజేయకుండా మల్లాగుల్లాలు పడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అందువల్ల అసలు నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైఖరి ఏంటో ఎందుకు చెప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఇప్పటికైనా కాంగ్రెస్ నుంచి రాహుల్  తన వైఖరిని తెలియజేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  పునర్విభజనను వ్యతిరేకిస్తూ లేఖ ఇవ్వాలని,  లేదంటే పార్లమెంట్ లో నైనా మాట్లాడాలని విషయాలు తైరపైకి వస్తున్నాయి. ఈ రెండూ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేసి.. ఆ రాష్ట్రాల వచ్చే ఆదాయాన్ని(జీడీపీ -36 శాతం)  సొమ్మును దోచుకుని.. ఉత్తరాదిరాష్ట్రాల ఓట్లతో గద్దెనెక్కేందుకు కుట్రలు చేస్తోందని భావించాల్సి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.  ఇప్పటి వరకు రాహుల్ గాంధీ మాట్లాడకపోవడానికి కారణం బీజేపీ లాగే కాంగ్రెస్ కూడా ఓట్ల కుట్రలు చేయడమే అనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఎట్టాగు దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుండటంతో..తమకు ఒనగూరేదేమి లేదనే దోరణిలో హస్తం పెద్దలు ఉంటూ..ద్విపాత్ర అభినయం చేస్తూ..దక్షిణాది కాంగ్రెస్ పాలిత ప్రాంతాల నుంచి తమ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి(తెలంగాణ), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (కర్నాటక)లను స్టాలిన్ మీటింగ్ పంపించి ..జాతీయ రాజకీయాల్లో హీట్ ను పెంచింది. అయితే డీ లిమిటేషన్ పై ఏమి మాట్లాడకుండా ..మౌనంగా ఉండటం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనుకూలంగా మారుతుందా..? లేదంటే అసలుకే ఎసరు వస్తుందా..? అంటే వేచిచూడాల్సిందే..!

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress rahul-gandhi telangana

Related Articles