సమావేశం నుంచి కేశవరావు వెళ్లిపోయారు. పార్టీలో చేరిన తనకు పీసీసీ పదవి ఇస్తారని కేకే ఆశలు పెట్టుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, కే. కేశవరావు, మధుయాష్కి సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించారు. పీసీసీ రేసులో ఉన్న ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశం నుంచి కేశవరావు వెళ్లిపోయారు. పార్టీలో చేరిన తనకు పీసీసీ పదవి ఇస్తారని కేకే ఆశలు పెట్టుకున్నారు. కానీ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై కేకే చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.