vijay devarakonda: విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ టీజర్ రిలీజ్ !

రాజు కోసం భూమిని చీల్చుకుని పుట్టే రాజు కోసం ఎన్టీఆర్ వాయిస్ తో డైలాగ్స్ భలే అనిపించింది


Published Feb 13, 2025 10:48:00 PM
postImages/2025-02-13/1739467338_1473664vdkd.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న VD12  సినిమా టైటిల్ టీజర్ రిలీజయ్యాయి. ఈ మూవీకి కింగ్డమ్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ టీజర్ లో విజయ్ లుక్స్ డైలాగ్స్ , మ్యూజిక్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ మే 30 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు టీం.


టీజర్ లో ఏముందంటే .. అలసట లేని భీకర యుద్ధం..  అలలుగా పారే ఏరుల రక్తం.. వలస పోయినా అలిసి పోయినా ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు, మట్టినిండా మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం అంటూ  ఎన్టీఆర్ వాయిస్ తో అధ్భుతంగా ఉంది. రాజు కోసం భూమిని చీల్చుకుని పుట్టే రాజు కోసం ఎన్టీఆర్ వాయిస్ తో డైలాగ్స్ భలే అనిపించింది.అదే సమయంలో హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ మంచి హిట్ కొడతాడనే ఫ్యాన్స్ నమ్మకం.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vijaydevarakonda teaser-release

Related Articles