కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలువనున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలువనున్నారు. బీజేపీలోకి ఆహ్వానించే అవకాశం ఉందంటూ జోరుగా చర్చ జరుగుతుంది. కాగా, ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంపై జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. తనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో అనుచరుల ఫోన్ ఎత్తకుండా జీవన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కో అర్డీనేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు. అయితే సంజయ్ చేరికపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. సోమవారం ఉదయం జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం ఆయనతో మాట్లాడుతున్నట్లు సమాచారం.