Paradise: ఇది కడుపు మండిన కాకి కథ...నాని కథ .ప్యారడైజ్ గ్లింప్స్ !

శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన 'రా స్టేట్‌మెంట్ గ్లింప్స్'ను సోమవారం విడుదల చేశారు.


Published Mar 03, 2025 01:07:00 PM
postImages/2025-03-03/1740987512_nanitheparadise03120661716x90.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నాని ఏదైనా పట్టుకున్నాడా...అది హిట్టు ...మిస్ అయితే ఎవరేజ్ అంతేకాని ప్లాప్ మాత్రం కాదు. ఈ కోవలోనే శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం వంటి మాస్ కథాంశాలతో సినిమాలు చేసిన నాని మరోసారి రా అండ్ రస్టిక్ ఊరమాస్ కథాంశంతో 'ప్యారడైజ్' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. దసరా చూశాక నాని క్లాస్ హీరో ట్యాగ్ పోయింది. మాస్ లో కూడా నాని ఇరగదీసేస్తాడంటున్నారు. అయితే ప్యారడైజ్ మూవీ ని డైరక్ట్ చేస్తున్నది శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన 'రా స్టేట్‌మెంట్ గ్లింప్స్'ను సోమవారం విడుదల చేశారు.


మదర్స్ రా స్టేట్ మెంట్స్ , సన్ రెవల్యూషన్ పేరుతో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ ను గమనిస్తే ఓ పవర్ ఫుల్ వాయిస్ తో కథాంశాన్ని వివరిస్తూ చెబుతున్న గొంతు మనకు వినిపిస్తుంది. "చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమనా.. జమనాల కెళ్లి నడిచే శవాల కథ... అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. ఓ థగడ్ వచ్చి మొత్తం జాతిలో ఓ జోష్ తెచ్చిండు... కాకులు తల్వర్‌లు పట్టినయ్.. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఓ లం... కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ.. నీయమ్మ" అంటూ చెబుతున్న వాయిస్ ఎండ్ అవుతుంది. వాయిస్ బేస్ ...చాలా షార్ప్ డైలాగ్ తో గ్లింప్స్ అదిరిపోయింది.


గ్లింప్స్‌ను చూస్తుంటే ఈ రా అండ్ రస్టిక్ సినిమాలో రక్తపాతం, హింస, సంభాషణల విషయంలో డోస్‌ను దర్శకుడు కాస్త పెంచినట్లు తెలుస్తోంది. బడ్జెట్ కూడా నాని కెరీర్ లో కాస్త పెద్ద బడ్జెట్ తో చేస్తున్న సినిమా . అయితే ఈ మూవీ 2026 మార్చి 26 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news nani -glimpse srikanth

Related Articles