శ్రీవెంకటేశ్వర సినీ మూవీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ డైరక్షన్ లో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో జాక్ అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ మూవీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ డైరక్షన్ లో ఈ జాక్ సినిమా తెరకెక్కుతుంది. వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా చేస్తుంది.
తాజాగా నేడు సిద్ధూ జొన్నలగడ్డ పుట్టిన రోజు కావడంతో జాక్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో సీనియర్ యాక్టర్ నరేష్ , సిధ్దు మధ్య వచ్చే తండ్రీ కొడుకుల సన్నివేశాలు , హీరోల క్యారక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ అసలు హీరో ఏంటి ? ఏ ఉద్యోగం చేస్తున్నాడు . అతని టార్గెట్ ఏంటి ? అతని ప్రేమ కథ ఏంటి అన్నట్లు చూపించారు. హీరో ఏం పనిచేస్తున్నాడో సినిమా లో అని ఆసక్తి నెలకొల్పేలా చేశారు. టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది.టీజర్ సూపర్ అంటున్నారు నెటిజన్లు. సిధ్దు కు మరో హిట్టు పక్కా అని కామెంట్లు పెడుతున్నారు.