ఇప్పటికి దాదాపు 402 కి చేరింది. గాలింపుల్లో భాగంగా 170 మంది మిస్ అయినట్లు లెక్కలు చెబుతున్నారు అధికారులు అయితే కొండ చరియల విరిగి పడడంతో చాలా మృతదేహాలు చిలియాన్ నది లో కొట్టుకువస్తున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కేరళలోని వయనాడ్ జిల్లా లో ఇంకా మృతుల ఆర్తనాధాలు తగ్గలేదు. మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికి దాదాపు 402 కి చేరింది. గాలింపుల్లో భాగంగా 170 మంది మిస్ అయినట్లు లెక్కలు చెబుతున్నారు అధికారులు అయితే కొండ చరియల విరిగి పడడంతో చాలా మృతదేహాలు చిలియాన్ నది లో కొట్టుకువస్తున్నాయి.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా చలియార్ నదిలో మృతదేహాలు, శరీర అవయవాలు కొట్టుకుని వస్తుండడంతో, ప్రత్యేక బృందాల సాయంతో అక్కడ కూడా గాలిస్తున్నారు. శరీర అవయవాలు ఎవరివన్నది గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు.
గాలింపు కార్యక్రమాల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పోలీసు శాఖ, అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది, వాలంటీర్లతో కలిపి 1200 మందికి పైగా పాల్గొంటున్నారు. వయనాడ్ సహాయకచర్యలు దాదాపు 8 రోజులకు చేరుకున్నాయి. యావత్తు భారత్ కేరళకు అండగా నిలుస్తున్నారు. అన్ని ఇండస్ట్రీ నుంచి పెద్దలు, గొప్పవాళ్లంతా చేయి కలిపి కేరళకు సాయం చేస్తున్నారు. ఇలా నదిలో మానవ అవయవాలు కొట్టుకురావడంతో కేరళ ప్రజలు ఆచూకీ తప్పిన కుటుంబాలు మరింత భయాందోళనకు చేరుకున్నాయి.