kavitha Supreme court:అసలు కోర్టులో ఏం జరిగింది.?

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌‌ అంశం మంగళవారం ఉదయం 11.40 గం.ల నుంచి మధ్యాహ్నం 1.12 గం.ల వరకు వాదనలు జరిగాయి. సుమారు గంటన్నర పాటు వాదోపవాదాల్లో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు


Published Aug 28, 2024 08:25:01 AM
postImages/2024-08-28/1724813701_kavithamlc.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఎమ్మెల్సీ కవిత బెయిల్‌‌ అంశం మంగళవారం ఉదయం 11.40 గం.ల నుంచి మధ్యాహ్నం 1.12 గం.ల వరకు వాదనలు జరిగాయి. సుమారు గంటన్నర పాటు వాదోపవాదాల్లో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్‌పై వాదనలు విన్నది. కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ విచారించారు. ఈడీ, సీబీఐ కేసులలో బెయిల్ కోసం ఆయన వాదనలు వినిపించారు. వాదనలకు సంబంధించి పూర్తి వివరాలు..

రోహత్గీ: సహ నిందితుడు సిసోడియాకు ఈ కేసులో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ, ఈడీ రెండింటికి సంబంధించిన కేసులలో దర్యాప్తు పూర్తయ్యింది. 

పీఎంఎల్ఏ చట్టం కాపీని ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది. 

రోహత్గీ: ఈ రెండు కేసుల్లోనూ 493 మంది సాక్షులు, 50వేల పేజీలు దస్త్రాలు, 57 మంది నిందితులు ఉన్నారు. కవిత ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఆమె జస్టిస్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఆమె సామాన్యురాలు కానందున ప్రయోజనకర నిబంధనలు పొందలేరని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. 

జస్టిస్ గవాయ్: (చిరునవ్వు నవ్వుతూ..) మీరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే మీకు ఏది మంచో.. ఏది చెడో తెలుస్తుంది. సామాన్యురాలు కాదు.

రోహత్గీ: సౌత్ గ్రూప్‌కు చేరినట్టు చెబుతున్న డబ్బులలో ఇప్పటి వరకు ఎలాంటి రికవరీ లేదు. నా క్లయింట్ సాక్షులను బెదిరించిందని చెబుతున్నా.. దానికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు.   

రోహత్గీ: నా క్లయింట్ తండ్రి ముఖ్యమంత్రి  కావున ఆయనకు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశం ఉంది. అందువల్ల తను ఫోన్ మార్చుకున్నాను. జనం కార్లు, బొమ్మలు మార్చుకున్నట్టే ఇదీను. 

సుప్రీం ధర్మాసనం: రోహత్గీ మార్చుకున్నట్టు?
కవిత తరఫున వాదనలు వినిపించడానికి  కోర్టులో సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, దామ శేషాద్రి నాయుడు ఉన్నారు. 

సీబీఐ, ఈడీ కేసులలో కవితకు ప్రయోజనకర నిబంధనలు ఎందుకు అప్లయ్ చేయలేదని ఏఎస్‌జీ ఎస్వీ రాజును ధర్మాసనం ప్రశ్నించింది.

ఏఎస్‌జీ: ఆమె ఫోన్‌ను ధ్వంసం చేసింది.. అలాగే ఫార్మాట్ చేసింది. 

రోహత్గీ: నా క్లయింట్ తన ఫోన్‌ను సర్వెంట్‌కు ఇచ్చింది. 

ఏఎస్‌జీ: ఐఫోన్ ఇచ్చారా?

రోహత్గీ: అవును.. అయితే ఏంటి?

సుప్రీం కోర్టు: ఇప్పుడు మనం ఏఎస్‌జీ వాదనలు విందాం.

ఏఎస్‌జీ: సాక్ష్యాలను మార్చగలదు.. సాక్షులను బెదిరించగలదు. దయచేసి గమనించగలరు. 

జస్టిస్ విశ్వనాథన్: మిస్టర్ రాజు.. ఫోన్ అనేది వ్యక్తిగత వస్తువు. ఇతర అంశాలు కూడా ఉండి ఉండొచ్చు. మానవీయ సంబంధాల విషయంలోనే ఇది చెబుతున్నా. ఎక్సేంజ్ చేసుకున్నప్పుడు మెసేజులు తొలగించడం అనేది సాధారణ విషయం. స్కూల్, కాలేజ్ గ్రూపుల నుంచి మెసేజులు డిలీట్ చేసే అలవాటు నాకు కూడా ఉంది. 

ఏఎస్‌జీ: కానీ, ఫోన్‌ను ఫార్మాట్ చేయరు కదా. ఆమె అలా చెయ్యమని చెప్పారు. 

జస్టిస్ గవాయ్: చాలా మందికి రెండు మూడు ఫోన్లు ఉంటున్నాయి కదా!

జస్టిస్ విశ్వనాథన్: అవును, వ్యక్తిగత నంబర్స్ మన దగ్గర పెట్టుకోవాలి. లేకుంటే కాల్స్ వెల్లువెత్తుతాయి. 

ఏఎస్‌జీ: అవును, నేను కూడా రెండు ఫోన్లు వినియోగిస్తుంటాను. నాకు ఐఫోన్ అంటే నచ్చదు. కానీ మనవళ్లతో ఫేస్ టైమ్ మాట్లాడటానికి ఆండ్రాయిడ్‌తో పాటు ఒకదాన్ని అట్టే పెట్టుకున్నాను. 

ఏఎస్‌జీతో సుప్రీం: తను నేరం చేసిందనడానికి మీ దగ్గరున్న మెటీరియల్ ఏంటి?

ఏఎస్‌జీ: ఓ మహిళగా తను ఎందుకు ప్రయోజనం పొందకూడదంటున్న దానిపై నేను మాట్లాడుతున్నాను. మెరిట్స్ గురించి కాదు. 

సుప్రీం: హైకోర్టు జడ్జి చెప్పినట్టుగా కవిత విద్యావంతురాలు. దానర్థం ఆమె రాజకీయాలకు, రాష్ట్రానికి గొప్ప సేవ చేశారని తెలుస్తోంది. 

జస్టిస్ విశ్వనాథన్: టాంపరింగ్ చేశారనడానికి సాక్ష్యాలు చూపాలి. ఇక్కడ కేవలం ఫార్మాటింగ్‌కు సంబంధించినవే ఉన్నాయి. 

ఏఎస్‌జీ: ఇతర నిందితులతో ఆమెకున్న సంబంధాలను చూపడానికి మా దగ్గర సీడీఆర్ ఉంది. 

కేంద్ర సంస్థలు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్స్‌ను కోర్టు ముందు ఉంచింది ఏఎస్‌జీ. 

ఏఎస్‌జీ వాదనలకు స్పందిస్తూ: ఆ సమయంలో అరుణ్ పిళ్లై మీ కస్టడీలో ఉన్నారు. అతడి స్టేట్‌మెంట్‌కు ఆమె ఎలా బాధ్యురాలు అవుతుంది.? 

ఏఎస్‌జీ: కస్టడీ నుంచి అయితే కాదు.. అక్కడి నుంచి ఏమీ చేయలేరు. జనం నుంచి పొందే అవకాశం ఉంది. 

జస్టిస్ విశ్వనాథన్: నిర్దుష్టంగా చట్టపరమైన కోణం నుంచి చూస్తే.. సహనిందితుడిని సాక్షిగా ఎంతమేరకు చూడగలం.? ఇది ఎంత నేరపూరితం? మీరు ఇక్కడి నుంచి ప్రారంభించలేరు. ఇతర సాక్ష్యాలను మార్షలింగ్ చేసిన తర్వాత ఇచ్చిన ప్రకటనలపై దృష్టి పెట్టాలి. ఉపసంహరణలను పక్కనపెడుతున్నాం కానీ, చట్టపరమైన కోణంలో ఉపసంహరించుకోని స్టేట్మెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. 

ఏఎస్‌జీ: కౌంటర్ నుంచి ఆమె పాత్రను చదివి వినిపిస్తాను.   

రోహత్గీ: న్యాయబద్ధంగా ఉండాలి. ఈ స్టేట్మెంట్స్ కేజ్రీవాల్, సిసోడియాలపై ఆధారపడి ఉంటాయి. కొంతమంది మొదట నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి.. అప్రూవర్‌గా మారిన తర్వాత కస్టడీలో వాటిని మార్చుకున్నారు. 

సుప్రీం: ఇదంతా ట్రయల్‌లో వాదించినట్టుగానే ఉంది. కానీ, కాస్త దాన్ని ఫాలో అవ్వండి. 

రోహత్గీ: ఈ వాదన ట్రయల్ అనంతరం దోష నిర్ధారణ లాంటిది. 

జస్టిస్ విశ్వనాథన్: అప్రూవ్ అయిన స్టేట్‌మెంట్స్‌ను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంటుంది. 

జస్టిస్ గవాయ్: అయితే ట్రయల్‌లో వాదించినట్టుగా వాదించొద్దు. ఈ స్టేట్‌మెంట్స్ అన్నీ ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పొందిన వాటిపై ఆధారపడి ఉన్నాయి.  ఈవిధంగా బెయిల్ అంశంపై వాదించుకుంటూ వెళ్లినట్టు అయితే రోజూ రెండు మూడు అంశాల కంటే మించి తీసుకోలేం. పార్టీలు, సెలబ్రిటీల పేరుతో వీటిని అనుమతించలేం. బెయిల్ అంశం గంటల కొద్దీ వాదనలు వినలేం.

ఏఎస్‌జీ: క్షమించగలరు. సంబంధం లేని విషయాలను నేను చదవలేదు.

సుప్రీం: మీరు ఏ నిందితుడినీ ఇలా పిక్ చేసుకోవడం కానీ, ఎంపిక చేసుకోవడం కానీ చేయకూడదు. అప్రూవర్ల స్టేట్మెంట్లు తీసుకున్నట్టు అయితే కేసులో కవిత పాత్రకు తగ్గట్టుగా వాళ్ల పాత్ర ఉండాలి. ప్రాసిక్యూషన్ అనేది న్యాయబద్ధంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని పిక్ చేసుకోవడం, ఎంపిక చేసుకోవడం చేయరాదు. దీనిలో ఏది న్యాయబద్ధంగా ఉంది.? నిందితులుగా పేర్కొంటూనే సాక్షులుగా మారతారా? 

జస్టిస్ గవాయ్: ఎంతగా వాదిస్తే అంతగా పరిశీలనలను మా నుంచి ఎదుర్కోవలసి ఉంటుంది. 

జస్టిస్ విశ్వనాథన్: మహిళగా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది వాదన?

ఏఎస్‌జీ: ఇది మరోరకంగా ఉపయోగపడుతుందనేది నా ఆందోళన. 

ఆర్డర్: లీవ్ గ్రాంటెడ్ .. అప్పీల్స్ సవాల్ చేసుకోవచ్చు. 

ఏఎస్‌జీ: మి లార్డ్.. 

సుప్రీం: ఇది ఇలాగే కొనసాగుతుందంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. బెయిల్ విషయంలో ఇంతటి విస్తృతమైన వాదనలు కరెక్టు కాదని మరీ మరీ చెబుతున్నాం. దర్యాప్తు పూర్తయ్యింది. ఛార్జిషీట్, ఈడీ ఫిర్యాదుల ఫైల్ అయ్యాయి. ట్రయల్ పూర్తి కాలేదు.. త్వరలో పూర్తవుతుందని అంటున్నారు. ఇక మిగిలింది మహిళ అనే అంశం. 

ఏఎస్‌జీ: కారణాలను రికార్డు చేయకపోవచ్చు.. చిత్రాచిత్రమైన వాస్తవాలను చెప్పి ఉండొచ్చు.. అయితే వాటిని ఇంతకుముందు వాటిలా చూడకూడదు. 

సుప్రీం: అయితే మేము గంటా, గంటన్నర సాగిన వాదనల తర్వాత చెబుతున్నాం. 

ఏఎస్‌జీ: నాకు ఎలాంటి అబ్జర్వేషన్స్ లేవు. మళ్లీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చర్చిద్దాం. 

సుప్రీం: కేంద్ర దర్యాప్తు సంస్థలు దీనిపై ఏమైనా పేర్కొన్నాయా? వాటి ఆధారంగా అప్పుడు మేము బెయిల్ ను నిరోధించగలం. కండిషన్స్ పెట్టగలం. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టుగా ఈ విద్యావంతురాలు బెయిల్‌ పొందాలంటే కొంత చర్చ జరగాల్సిందే. ఈ ఢిల్లీ హైకోర్టు తీర్పు చట్టంగా అనుమతించి ఉంటే, ఏ విద్యావంతురాలు కూడా బెయిల్ పొందలేరు. దీన్ని కనీసం ఢిల్లీ న్యాయ పరిధిలో ఉన్న అన్ని కోర్టులకు వర్తింప చేయాల్సి ఉంటుంది. అసలు ఏంటిది? మేం చెప్పేది ఏంటంటే కోర్టులు ఎప్పుడూ కూడా ఎంపీలు, సామాన్యులు అన్న తేడా చూడకూడదు. న్యాయ విచక్షణ అనేది కృత్రిమంగా జరిగిందన్న విషయాన్ని గుర్తించాం. 

ఏఎస్‌జీ: అలా అయితే ప్రతి కేసులో వాస్తవాల ఆధారంగా కేసును చర్చించండి. 

సుప్రీం: అవును, సిసోడియా కేసులో కూడా.. కనీసం మాకు 5-6 పేజీలు ఇవ్వండి. 

తీర్పును చదువుతున్న జడ్జీలు: బెయిల్‌పై  రోహత్గీ, నాయుడు, చౌదరిలతో ఎస్వీ రాజు సాగించిన సుదీర్ఘమైన వాదనలు విన్నాం. ట్రయల్ సందర్భంగా సవివరమైన చర్చలను పక్కన పెట్టాలన్న ఎస్వీరాజు సూచన న్యాయబద్ధంగా ఉంది. కోర్టులో కేసుల వాదనలలో అలాంటి విస్తృతమైన చర్చలను పక్కన పెట్టడమే సరైనదిగా భావిస్తున్నాం. 

తీర్పు: మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తీర్పులపై రోహత్గీ ఆధారపడ్డారు. 493 మంది సాక్షులను విచారించారు, 50వేల దస్త్రాలను సిద్ధం చేశారు, కానీ నేరం జరిగిందంటున్న దాన్ని ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. పీఎంఎల్ఏ సెక్షన్ 45(1)లోని క్లాజ్ 5లో మహిళకున్న ప్రత్యేక సదుపాయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 

అయితే, ఎస్వీ రాజు ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. సాక్షుల వాంజ్ఞ్మూలాలు, అప్పీలుదారు ఒక కింగ్‌పిన్ అని స్పష్టంగా చూపుతాయని పేర్కొన్నారు. కేసు మెరిట్‌లోకి మేం పోదలుచుకోలేదు. కేవలం సాక్షులుగా మారిన నిందితుల గురించి మాత్రమే మేం మాట్లాడుతున్నాం. 

ఏఎస్‌జీ: ఎందుకు మి లార్డ్.? ట్రయల్ సందర్భంగా మీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధిస్తున్నాయి.  

ఒకవేళ ఇది సరైనట్టుగా లేకపోతే తీర్పు నుంచి ఈ పదాన్ని తొలగిస్తాం.  

తీర్పు: దర్యాప్తు పూర్తయ్యింది. ఛార్జీషీటు కూడా ఫైల్ అయ్యింది. అప్పీలు దారు కస్టడీ ఇక అవసరం లేదు. ఇప్పటికే తను ఐదు నెలలుగా జైలులో ఉంది. సమీప భవిష్యత్తులో  ట్రయల్ పూర్తవ్వడం అసాధ్యం. 

ఇదే కోర్టు పలు కేసుల్లో చెప్పినట్టుగా, అండర్ ట్రయల్ కస్టడీ అనేది ఎప్పుడూ శిక్షగా మారకూడదు. 45(1) అనేది మహిళల విషయంలో ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి. 

ఏఎస్‌జీ: త్రిసభ్య ధర్మాసనం ఇది న్యాయవిచక్షణ కిందకు వస్తుందని తెలిపింది. మీరు చెప్పినట్టుగా అయితే ఇది ఒకదానికొకటి విరుద్ధమవుతుంది. 

సుప్రీం: మేం ఇంకా పూర్తి ఆర్డర్ చదవకముందే, మా ఆర్డర్ పరస్పర విరుద్ధమని ఎలా చెప్పగలుగుతారు?

తీర్పు: నిబంధనలను బట్టి మహిళలతో సహా నిర్దిష్ట వర్గం నిందితులు బెయిల్‌కు అనుమతించబడుతున్నారు. ప్రతి కేసు యొక్క వాస్తవాలు, పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే  ప్రత్యేకంగా అటువంటి ప్రయోజనాన్ని అందించినప్పుడు, కోర్టు దానిని తిరస్కరించడానికి నిర్దిష్ట కారణాలను చూపవలసి ఉంటుంది.

తీర్పు: ఏ నిందితుడిని భిన్నంగా పరిగణించరాదని ప్రతిరోజూ ఈ కోర్టు చెబుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ సింగిల్ జడ్జి సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడానికి ఎంచుకున్న ప్రమాణాలు బాధాకరంగా ఉన్నాయి.  అప్పీలుదారు రాజకీయ నేపథ్యాన్ని చూపి బెయిల్ నిరాకరించడం బాధాకరం. కోర్టు తీవ్రమైన ఆరోపణలను దృష్టిలో ఉంచుకోలేమని పేర్కొంది. ప్రస్తుత అప్పీలుదారు సామాన్యమైన మహిళ కాదన్న విషయాన్ని గమనించాలి.

తీర్పు: కోర్టులో ఈ వర్గం విషయంలో మరింత సున్నితంగా, దయతో ఉండాలి.

తీర్పు: నిబంధనల విషయంలో సింగిల్ జడ్జి పూర్తిగా తనకు తాను తప్పుదోవపట్టారు. 

ఫలితంగా మేము అప్పీల్‌ను అనుమతిస్తున్నాం. ఆర్డర్‌లను పక్కన పెట్టాం. అప్పీలుదారుని బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం. 

తీర్పు: సీబీఐ, ఈడీ కేసుల్లో చెరో రూ.10 లక్షల పూచీకత్తుతో విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం. సాక్ష్యాలను తారుమారు చేయకూడదు. ప్రొసీడింగ్స్‌ను ప్రభావితం చేయకూడదు. పాస్ పోర్టు సరెండర్ చేయాలి. దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్ చేయాలి. 

తీర్పు: దర్యాప్తునకు కచ్చితంగా సహకరించాలి. మెరిట్స్‌లో దర్యాప్తును ప్రభావితం చేసే అంశాలు లేవు.

ఇక్కడితో వాదనలు ముగిశాయి.
 

newsline-whatsapp-channel
Tags : news-line justice kavitha supreme-court asg justice-viswanathan rohatgi

Related Articles