మార్చి 31 పోయింది  టకీ టకీ మని పైసల్ పడలే..!


Published Apr 01, 2025 10:39:39 AM
postImages/2025-04-01/1743484179_Telugu36.jpg

మార్చి 31 పోయింది 
టకీ టకీ మని పైసల్ పడలే..!

ఇప్పటికీ చాలామందికి రాని రైతుభరోసా..!
4 ఎకరాల లోపువాళ్లకే పడిన డబ్బులు
మార్చి 31 వరకు అందరికీ
రైతుభరోసా ఇస్తామన్న రేవంత్ రెడ్డి
18లక్షల మందికిపైగా రాని భరోసా 
ఆందోళనలో అన్నదాతలు
వస్తాయా..? రావా అన్న సందేహాలు..!


అన్నదాతలను సర్కార్ మరోసారి మోసం చేసింది. మార్చి 31 వరకు రైతులందరికీ రైతుభరోసా వేస్తామని చెప్పి మాట తప్పింది. మార్చి నెల దాటినా ఇంకా రైతులందరి ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో అన్నదాతలు అయోమయంలో పడిపోయారు. డబ్బులు పడతాయా..? లేదా అన్న సందేహ పడుతున్నారు. ఇప్పటికే ఒక విడత రైతుబంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి కొంత మంది రైతులకు ఇచ్చి చేతులు దులుపుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 31) : రైతుభరోసా విషయంలో సర్కారు మరోసారి మోసం చేసింది. ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసినా డబ్బులు మాత్రం రాలేదు. మార్చి 31 లోపు అందరికి రైతుభరోసా డబ్బులు అకౌంట్లలో వేస్తామని జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఏప్రిల్ ఒకటి వచ్చినా డబ్బులు రాలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసాను ఎన్ని ఎకరాల వరకు ఇస్తామనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్నవాళ్లకే రైతుభరోసాను 3 నెలలుగా వేసుకుంటూ వచ్చింది. ప్రభుత్వం చెప్పిన గడువు కూడా పూర్తి కావడంతో ఇగ మిగిలిన రైతులకు రైతుభరోసా ఇవ్వదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రుణమాఫీ విషయంలో కొంత మంది మాత్రమే చేసి, అందరికీ ఇచ్చామని ప్రకటించింది. ఇప్పుడు అదే గుర్తు చేసుకొంటున్నారు రైతులు. ఇప్పటి వరకు ఇచ్చినవాళ్లే అర్హులనీ మిగితావాళ్లు కాదని ప్రకటిస్తుందన్న భయాందోళనలో ఉన్నారు.

18లక్షల మందికి బాకీ..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దాన్ని రూ.12వేలకే కుదించారు. యాసంగి పంట ప్రారంభమై 3 నెలలు దాటినా ఇప్పటి దాంక ఇంకా పూర్తిస్థాయిలో రైతుభరోసా వేయలేదు. జనవరి 26న అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతు భరోసా పైసలు జమచేసింది. మొత్తం 70 లక్షల మంది రైతులు ఉండగా,  52 లక్షల మందికే పంపిణీ చేసింది. ఇంకా 18 లక్షల మంది రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ యాసంగిలో రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రూ.4,166 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రైతులకు రూ.4,834 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువు దాటినా సర్కార్ మాత్రం మరో ప్రకటన చేయలేదు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress former telangana

Related Articles