బాలీవుడ్ లో వరుస ఫ్లాపులు కెరియర్ కు అంత మంచిది కాదనిపించింది అందుకే బాలీవుడ్ ను లైట్ తీసుకున్నానంటున్నారు రమ్యకృష్ణ.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద శివగామి తెలియని వారు లేరు. అసలు శివగామిగా కాదు ..ముందే నీలాంబరి గా ..అమ్మోరు గా ఎన్నో వందల క్యారక్టర్లు చేసి మెప్పించారు. ప్రతి క్యారక్టర్ కి వందకు వందద మార్కులు పడ్డాయి. అంత మంచి ఆర్టిస్ట్ . ఇంత మంచి ఆర్టిస్ట్ బాలీవుడ్ లో ఎందుకు వెళ్లలేదనుకుంటారు అంతా.
కాని కెరియర్ పీక్ లో ఉన్నపుడు రమ్యకృష్ణ సౌత్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అయితే కొంతకాలం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు రమ్యకృష్ణ. తను తెలుగు లో సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నపుడు బాలీవుడ్ లో వరుస ఫ్లాపులు కెరియర్ కు అంత మంచిది కాదనిపించింది అందుకే బాలీవుడ్ ను లైట్ తీసుకున్నానంటున్నారు రమ్యకృష్ణ.
1988 సంవత్సరంలో రమ్య తన తొలి హిందీ సినిమా చేసింది. 1988లో ఫిరోజ్ ఖాన్, రాజేష్ ఖన్నా, అమ్రిష్ పూరి నటించిన ‘దయావాన్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణ బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఇందులో ఆమె డ్యాన్సర్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ సీనియర్ బ్యూటీ అమితాబ్ బచ్చన్ , గోవిందాల ‘బడే మియాన్ ఛోటే మియాన్’ అలాగే షారుఖ్ ఖాన్ ‘చాహత్’ వంటి అనేక హిందీ చిత్రాలలో నటించింది. నిజానికి తెలుగు సినిమాలు వదిలేసి హిందీ సినిమాల ఫోకస్ పెడితే క్లిక్ అయ్యేదాన్ని కాని ..నేను ఆ రిస్క్ తీసుకోలేను.ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వడమే ముఖ్యం. తను స్టార్ అవ్వాలి. అది బాలీవుడ్ లోనైనా ...టాలీవుడ్ లోనైనా ఇప్పుడు నేనే స్టారే కదా..అందుకే బాలీవుడ్ జోలికి వెళ్లలేదు.