ఈ పోటీల్లో అమ్మాయిలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే ఓ ఇద్దరు యువతులు కుస్తీ పోటీల్లో పాల్గొని ఏకంగా ఇద్దరు యువకులను ఓడించి తమ సత్తా చాటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రస్తుతకాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల్ని అసలు అంచనా వేయలేం. ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని కుబీర్ లో కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో అమ్మాయిలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే ఓ ఇద్దరు యువతులు కుస్తీ పోటీల్లో పాల్గొని ఏకంగా ఇద్దరు యువకులను ఓడించి తమ సత్తా చాటారు.
మహారాష్ట్రలోని యవత్మల్ విదర్భ జిల్లాలోని పుస్సత్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు సాయిశ్వరీ, మానిలు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ఏకంగా పురుషులతో పోటీ పడి వారిని ఓడించి ఔరా అనిపించారు. పోటీల్లో విజేతలుగా నిలిచి అందరి ప్రశంసలను అందుకున్నారు. మరో దంగల్ చూసినట్లుందంటున్నారు స్థానికులు.