నేడు నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు.
నేడు బడ్జెట్‌పై చర్చ
ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై చర్చలో అసెంబ్లీ సభ్యులు అడిగే ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాదానాలు చెప్పనున్నారు.
నేడు నీతి ఆయోగ్ సమావేశం
నేడు నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో నేడు చర్చలు జరిగే అవకాశం ఉంది.
కమలాహారిస్ పోటీ ఖరారు
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ పోటీ ఖరారైంది. పోటీకి సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించారు. నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందనిధీమా వ్యక్తం చేశారు.
అల్లకల్లోలంగా సముద్రం
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.