Deepika Padukone: కల్కీ 2 నుంచి దీపికా ఔట్ ..కారణం అదే !

ఆ కారణమో మరి వేరే రీజనో తెలీదు కాని ప్రస్తుతం 'కల్కి 2898 AD' సినిమా సీక్వెల్ లో కూడా దీపిక నటించడం లేదని ప్రచారం జరుగుతోంది.


Published Jun 07, 2025 11:10:00 AM
postImages/2025-06-07/1749274902_deepikapadukone17492253176841749225318033.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రస్తుతం దీపిక చాలా హాట్ టాపిక్ ...ఓ రకంగా పెద్ద డిబెట్ నడిపిస్తుంది. ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్ మూవీ నుంచి దీపిక తప్పుకుంది. సందీప్ రెడ్డి తో చిన్న చిన్న డిస్కర్షన్స్ జరిగాయి ...ఇద్దరికి కుదరక ఆమెను తప్పించి తృప్తి దిమ్రీని హీరోయిన్ ను చేశాడు సందీప్ , అయితే ఇప్పుడు ఆ కారణమో మరి వేరే రీజనో తెలీదు కాని ప్రస్తుతం 'కల్కి 2898 AD' సినిమా సీక్వెల్ లో కూడా దీపిక నటించడం లేదని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన కాకపోయినా వార్త చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతుంది.


దీపిక ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో కలిసి ‘కింగ్’ సినిమాలో దీపిక నటిస్తోంది. ఒక బిడ్డకు తల్లి అయిన దీపికా పదుకొనే రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం తప్పు కాకపోయినా సినిమా లాభాల్లో వాటా అడగడం ...తన అవకాశాలకు ఎక్కువ డిమాండ్ చెయ్యడం సందీప్ రెడ్డి వంగాకు తప్పనిపించింది. డీల్ కుదరక దీపిక మీద కాస్త ఫైర్ అయ్యాడు ..దీపిక కూడా పీఆర్ టీం తో పెద్ద డ్రామానే ప్లే చేసింది.


 స్పిరిట్ గొడవ కాస్త సర్దుమణిగిందనుకుంటే ఇప్పుడు ‘కల్కి’ సినిమా సీక్వెల్ లో కూడా నటించడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగ్ అశ్విన్ టీం అసలు రియాక్ట్ అవ్వలేదు.ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ తో మ్యానేజ్ చెయ్యడం అసాధ్యం మరి దీపికా డిమాండ్స్ నాగ్ అశ్విన్ టీం ఏం చేస్తుందో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : kalki-2898-ad deepika-padukone newslinetelugu sandeep-reddy-vanga

Related Articles