ఈ ఏడాది (2024) ఆగస్టు 8వ తేదీన రాత్రి 12గంటలకు ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. మళ్లీ ఆగస్టు 9వ తేదీ రాత్రి 12గంటలకు క్లోజ్ చేస్తారు. ఈ ఆలయాన్ని మళ్లీ ఒక ఏడాది పాటు మూసేస్తారు. వచ్చే సంవత్సరం మళ్లీ నాగపంచమి రోజున తెరుస్తారు.
న్యూస్ లైన్, బ్యూరో: హిందువులు ఎక్కువగా దేవుళ్లను పూజిస్తారు. ప్రతిరోజు ఓ దేవుడికి మొక్కుకుంటారు. ఇలా అన్ని దేవాలయాలు ప్రతిరోజు ఉదయ నుంచి రాత్రి వరకు తెరిచే ఉంటాయి. మరికొన్ని చోట్ల అక్కడి పరిస్థితులను బట్టి ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే అక్కడి స్వామివారిని దర్శనం చేసుకునే వీలుంటుంది. కానీ ఏడాదిలో కేవలం ఒకే ఒక్కరోజు తెరిచే గుడి గురించి చాలా మందికి తెలియదు. అది ఎక్కడ ఉందో.. ఏ గుడినో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అష్టదశ శక్తిపీఠాల్లో ఇదో ఒకటి. అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదోది ఇక్కడే ఉంది. ఈ ఆలయంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏడాదిలో ఒకే ఒక్కరోజు మాత్రమే తెరిచి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుక్ల పక్షంలోని ఐదోవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈ రోజు మాత్రమే ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ ఏడాది (2024) ఆగస్టు 8వ తేదీన రాత్రి 12గంటలకు ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. మళ్లీ ఆగస్టు 9వ తేదీ రాత్రి 12గంటలకు క్లోజ్ చేస్తారు. ఈ ఆలయాన్ని మళ్లీ ఒక ఏడాది పాటు మూసేస్తారు. వచ్చే సంవత్సరం మళ్లీ నాగపంచమి రోజున తెరుస్తారు.