Deepika: భారత్‌కు నిరాశ.. ఒలింపిక్స్ నుంచి దీపిక ఔట్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి నిరాశ ఎదురైంది.


Published Aug 03, 2024 06:23:45 PM
postImages/2024-08-03/1722689625_deepika.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి నిరాశ ఎదురైంది. విశ్వ క్రీడ‌ల్లో రెండో సారి క్వార్ట‌ర్ ఫైనల్ దూసుకెళ్లిని దీపికా సెమీ ఫైన‌ల్‌ పోరులో ఓటమిపాలైంది. శ‌నివారం ద‌క్షిణ కొరియా ఆర్చ‌ర్ సు హైయ‌న్ చేతిలో 4-6తో ఓటమి మూటగట్టుకుంది. దీంతో కుమారిపై కోట్లాది మంది ప్రేక్షకులు పెట్టుకున్న‌ ఒలింపిక్ మెడ‌ల్ ఆశ‌ల‌న్నీఅడియాశ‌ల‌య్యాయి. ఒలింపిక్స్‌ టోర్నీలో ఫేవ‌రెట్‌గా బరిలోకి దిగిన దీపిక‌ శుక్ర‌వారం క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టి ప‌త‌కంపై ఆశ‌లు రేపింది. దాంతో క‌నీసం కాంస్యంతో ఆమె చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌నుకున్నారు. అయితే సెమీస్‌లో దీపిక మాత్రం త‌డ‌బ‌డింది. దీంతో దీపికా కుమారి ఇంటి దారిపట్టింది

newsline-whatsapp-channel
Tags : india deepa paris-olympic paris2024

Related Articles