అయోధ్య రామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన రూ.50 లక్షల విలువైన స్ట్రీట్ లైట్లు చోరీ అయ్యి.
న్యూస్ లైన్ డెస్క్: అయోధ్య రామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన రూ.50 లక్షల విలువైన స్ట్రీట్ లైట్లు చోరీ అయ్యి. అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తిపథ్ మార్గం రామాలయానికి వెళ్లే ప్రధాన రహదారి శృంగార్ ఘాట్ నుంచి హనుమాన్ గర్జికి చివరకు ఆలయానికి కలుపుతుంది. ఇక రామ్ పథ్, సదతంజ్ న్ను నయా ఘాట్‌ను కలుపుతూ 13 కిలోమీటర్ల పొడవైన హైవే ఉంది. అయితే ఈ రామ్ పథ్ మార్గంలో లైట్లను అమర్చే కాంట్రాక్ట్ను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ యష్ ఎంటర్ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలకు అప్పగించింది.
ఈ మార్గంలో మొత్తం 6,400 బాంబో లైట్లను, భక్తి పద్లో 6 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దుండగులు చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఆలయ ట్రస్టు అధికారులు పోలీసులకు తెలిపారు. అమర్చిన లైట్లు, ప్రొజెక్టర్లు చోరీకి గురైనట్లు సంస్థ ప్రతినిధి శేఖర్ శర్మ రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.