మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్లను పొగుడుతూ కాంగ్రెస్ వాళ్లను తిట్టిన ఎంఐఎం నేతలు, ఇప్పుడు కాంగ్రెస్‌ను పొగుడుతూ బీఆర్ఎస్‌ను తిడుతుందని అన్నారు. అంకుల్ బంధం పోయి ఇప్పుడు అన్నదమ్ముల బంధం వచ్చిందని ఎద్దేవా చేశారు.
న్యూస్ లైన్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే కొండగల్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేయాలన్నారు. డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు. ఎంఐఎం నేతలు గోడమీది పిల్లుల మాదిరిగా అధికారం ఎవరి వైపు ఉంటే వాళ్ల వైపే మాట్లాడతారని విమర్శించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్లను పొగుడుతూ కాంగ్రెస్ వాళ్లను తిట్టిన ఎంఐఎం నేతలు, ఇప్పుడు కాంగ్రెస్‌ను పొగుడుతూ బీఆర్ఎస్‌ను తిడుతుందని అన్నారు. అంకుల్ బంధం పోయి ఇప్పుడు అన్నదమ్ముల బంధం వచ్చిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా హిందువుల పండుగలకు సంబంధించిన నిధులపై అడుక్కునే పరిస్థితి మాత్రం మారడం లేదు. పాతబస్తీలో పరిధిలో మొత్తం 24 గుళ్లతో ఒక కమిటీ ఉంటుందని, కానీ ఈ సారి కేవలం 8 గుళ్లకు కేవలం 5లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. హిందువులకు ప్రభుత్వం ఏమైనా బిచ్చమేస్తుందా అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దలు బోనాల పండగకు వచ్చి పేపర్లకు ఫోజులివ్వడం కాదని అన్నారు. రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇచ్చి హిందువులకు కేవలం 5 లక్షలే ఇవ్వడం ఏంటని నిలదీశారు. ముస్లింలకు ఎందుకు ఇచ్చారని మేం అడగడం లేదని, హిందువులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భాగ్యనగరం అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని బండి సంజయ్ అన్నారు.