Test Match: పాక్‌పై బంగ్లాదేశ్ చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం

పాకిస్థాన్‌తో రెండు టెస్టు సిరీస్‌లో భాగంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో బంగ్లా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది.


Published Aug 25, 2024 06:13:39 PM
postImages/2024-08-25/1724589819_bangla.JPG

పాక్‌పై బంగ్లాదేశ్ చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం
తొలిసారి పాక్‌ను ఓడించిన బంగ్లా
ముష్ఫిక‌ర్ ర‌హీమ్ సూప‌ర్ సెంచ‌రీ
సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్‌

న్యూస్ లైన్ స్పోర్ట్స్: పాకిస్థాన్‌తో రెండు టెస్టు సిరీస్‌లో భాగంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో బంగ్లా జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. న‌జ్ముల్ హుసేన్ శాంటో సేన పాక్‌పై టెస్టుల్లో తొలి విజ‌యం న‌మోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన తొలి టెస్టులో బంగ్లా 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్(191) సూప‌ర్ సెంచ‌రీకి.. మెహిదీ హ‌స‌న్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడ‌వ్వ‌డంతో పాకిస్థాన్‌ చిత్తుగా ఓడింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే కుప్ప‌కూలింది. దీంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బంగ్లా ఆడుతూ పాడుతూ చేధించింది. ఒక‌ద‌శ‌లో డ్రా దిశ‌గా సాగిన రావ‌ల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ అస‌మాన పోరాటం క‌న‌బ‌రిచింది. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన బంగ్లా.. బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణించింది. దీంతో బంగ్లా, పాకిస్తాన్‌పై చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాట‌ర్లు బంగ్లా బౌల‌ర్ల‌ను ఉతికేశారు. సైమ్ అయూబ్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత సాద్ షకీల్ బంగ్లా బౌలర్లకు ఊచకోత చూపించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విశ్వరూపం చూచించాడు. ఇక షకీల్( 261 బంతుల్లో 141 పరుగులు 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో పాక్ స్కోర్ బోర్డను పరుగులు పెట్టించాడు. అయితే మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో షకీల్(141) పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజులో దిగిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ధనాధన ఇన్నింగ్స్‌తో బంగ్లా బౌలర్లను ఉతికారేశాడు. రిజ్వాన్( 239 బంతుల్లో 171 రన్స్ 11 ఫోర్లు, 3 సిక్సర్ల)తో సూపర్ సెంచరీ నమెదు చేశాడు. అయితే తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో పాకిస్థాన్ 448/6 వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన బంగ్లా బ్యాట‌ర్లు ప‌ట్టుద‌ల‌గా ఆడారు. ఓపెన‌ర్ షాద్మ‌న్ ఇస్లాం(183 బంతుల్లో 93 పరుగులు) విధ్వంసకర ఫిఫ్టితో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే మహ్మద్ అలీ బౌలింగ్‌లో ఇస్లాం(93) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శాంటో(16), షకీబ్(15), హసన్ మహమూద్(0) వరుసగా వెనుదిరిగారు. ఇక ఈ సమయంలో మొమినుల్ హ‌క్(50) హాఫ్ సెంచ‌రీల‌తో పునాది వేయ‌గా.. సీనియ‌ర్ ఆట‌గాడు ముష్ఫిక‌ర్ ర‌హీం అద్భుతమైన బ్యాటింగ్‌తో రాణించాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ రహీం( 240 బంతుల్లో 191 పరుగులు 22 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో కదం తొక్కాడు. కాగా, మహ్మద్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక లిట్ట‌న్ దాస్(56), మెహిదీ హ‌స‌న్ మిరాజ్(77) కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దాంతో, నాలుగోరోజు బంగ్లా 565 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యింది.


రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ జ‌ట్టు బ్యాట‌ర్లు తేలిపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూ నిరాశ పరిచారు. మ‌హ్మ‌ద్ రిజ్వాన్( 80 బంతుల్లో 51 పరుగులు) ఒక్క‌డే అర్ధ శ‌త‌కంతో పోరాడాడు. మిగ‌తావాళ్ల నుంచి స‌హ‌కారం అంద‌లేదు. కాగా, మెహిదీ హ‌స‌న్ మిరాజ్(4/21), ష‌కీబుల్ హ‌స‌న్(3/44)లు చెల‌రేగ‌డంతో పాక్ 146 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. ఇక స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ అల‌వోక‌గా చేధించింది. ఓపెన‌ర్లు జ‌కీర్ హ‌స‌న్(15 నాటౌట్), ష‌ద్మాన్ ఇస్లాం(9)లు మెర‌పు బ్యాటింగ్‌తో బంగ్లా, పాకిస్తాన్ జట్టుపై 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించింది. 
 

newsline-whatsapp-channel
Tags : won-the-match bangladesh cricket-news test-match pakistan

Related Articles