తెలంగాణలో ఉన్న కోచ్‌లందరినీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం దారుణమని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో ఉన్న కోచ్‌లందరినీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం దారుణమని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం నేతృత్వంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ప్రతిభతో క్రీడా ప్రాడిజీలను ఉలికి తీయడానికి సుమారు 24 సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణాలో ఉన్న కరాటే కోచ్‌లందరినీ సామూహికంగా తొలగించి, అకాడమీలన్నింటినీ మూసివేశారని మండిపడ్డారు. పేద పిల్లలు తమ కోచ్‌లను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నిలబడేది దినీ కోసమేనా అని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను నిలదీశారు. ఒకవైపు రాహుల్ రాజ్యాంగాన్ని పట్టుకుని మరోవైపు రాజ్యాంగం సాకారం చేస్తానని హామీ ఇస్తున్నారని అన్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అట్టడుగువర్గాల కలలను కూల్చివేస్తున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.