రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను మంగళవారం తన నివాసంలో పిలుచుకుని టీ20 ప్రపంచకప్ 2024 సాధించినందుకు సిరాజ్‌కు సీఎం రేవంత్ అభినందించారు.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను తన నివాసంలో పిలుచుకుని టీ20 ప్రపంచకప్ 2024 సాధించినందుకు సిరాజ్‌కు సీఎం రేవంత్ అభినందించారు. ఈ సందర్భగా సీఎం రేవంత్ రెడ్డి, సిరాజ్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం సిరాజ్ భారత్ జెర్సీని సీఎం రేవంత్‌కి బహుకరించారు. ఇక సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమెరికా, వెస్టిండీస్ అధ్యతం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో రోహత్ శర్మ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలు సాధించి టీ20 విశ్వవిజేతగా నిలిచింది. ఈ గ్రాండ్ విక్టరీలో సిరాజ్ లీగ్ మ్యాచ్‌ల్లో కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించాడు. తర్వాత కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇవ్వడంతో సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.