ఈ నెల ఒకటిన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా రహస్యంగా ఉంచడం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయం డెడ్‌స్టోరేజీ నుండి కృష్ణాజలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో భారీ ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్ వాల్ కుప్పకూలిపోయింది. ఈ నెల ఒకటిన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా రహస్యంగా ఉంచడం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
నాగార్జున సాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. మరోవైపు నీటిమట్టం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే రక్షణ గోడ వెనక గేటును ఏర్పాటు చేసి.. సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, జలమండలి అధికారులు నిర్యక్ష్యం కారణంగానే ఘోర ప్రమాదం జరిగిందని మరో వాదన కూడా వినిపిస్తోంది.
సాగర్ జలాలు సొరంగాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు నిర్మించిన రిటెయినింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో సుంకిశాల పంపుహౌస్ పూర్తిగా మునిగిపోయింది. అయితే , కూలీలు షిఫ్టులు మారే సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో భారీ ప్రాణనష్టం తప్పిందని చెప్పుకోవచ్చు.
షాకింగ్ లైవ్ వీడియో
నాగార్జున సాగర్ వద్ద కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్ వాల్ pic.twitter.com/HLPCeWjyaB — News Line Telugu (@NewsLineTelugu) August 8, 2024