సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం పాలసీలో అరెస్టయిన కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసులో మాత్రం ఆయనకు బెయిల రావడంలేదు. సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఈ మేరకు గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. గురువారం వాదనలు విన్న కోర్టు ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ తీహా జైలులో ఉన్నారు.