చాలా మందికి ప్రొటీన్ అధిక మొత్తంలో ఉంటుంది.అలాంటప్పుడు శరీంరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మన శరీరానికి రోజు ప్రోటీన్ కావాల్సిందే . ఇందుకే రోజు గుడ్డు తినండి..లేదంటే నానబెట్టిన బాదం ..పాలు ఇలా తాగండంటూ పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మందికి ప్రొటీన్ అధిక మొత్తంలో ఉంటుంది.అలాంటప్పుడు శరీంరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.
ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అధిక ప్రోటీన్ మాంసాహారాల్లో ఉండే కీమికల్స్ వల్ల రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
హాట్ డాగ్స్, హామ్, బేకన్, డెలీ మీట్స్ లాంటి ప్రాసెస్డ్ మీట్‌లను తరచూ తినడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది.
శరీరంలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇది మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది. అధిక ప్రోటీన్ వల్ల శరీరంలోని కాల్షియం స్థాయి తగ్గుతుంది.
అధిక ప్రోటీన్ తీసుకోవడం మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది కిడ్నీ ఫంక్షన్‌కి భంగం కలిగించడంతో పాటు డీహైడ్రేషన్, విరేచనాలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
కాబట్టి న్యూట్రిషన్ ఫుడ్ మీట్ ..చాలా వరకు డేంజర్ . షుగర్స్ ఆపేయాలి. మైదా ...హై ప్రొసెస్డ్ ఫుడ్ మానేస్తేనే మంచిది.