టీమిండియాకు ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారు. సోషల్ మీడియాలో మన భారత్ టీం కు దక్కుతున్న గౌరవాన్ని చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన టీమిండియాకు నిన్న సాయంత్రం ముంబయిలో లభించిన స్వాగతం చరిత్రలో నిలిచిపోతుంది. ముంబయి మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు టీమిండియా ఆటగాళ్లను ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా తీసుకువెళ్లగా... ఈ విక్టరీ పరేడ్ కు లక్షల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమిండియాకు ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతం పలుకుతున్నారు. సోషల్ మీడియాలో మన భారత్ టీం కు దక్కుతున్న గౌరవాన్ని చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన టీమిండియాకు నిన్న సాయంత్రం ముంబయిలో లభించిన స్వాగతం చరిత్రలో నిలిచిపోతుంది. ముంబయి మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు టీమిండియా ఆటగాళ్లను ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా తీసుకువెళ్లగా... ఈ విక్టరీ పరేడ్ కు లక్షల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో దేశ దేశాలు తిరుగుతున్నాయి. ఒకింత ఆశ్చర్యపోతున్నారు కూడా. అందులో ఓ ఫోటో కు ఐస్ ల్యాండ్ దేశ క్రికెట్ బోర్డు నోరళ్లబెట్టింది. వామ్మో ఇంత జనమా...మా దేశ జాతీయ జనాభా కూడా ఇంత ఉండదు. అసలు మా దేశ జనాభా కంటే టీమిండియా వరల్డ్ కప్ పార్టీ వచ్చిన జనం మా దేశ జనాభాకు 20 రెట్లు ఎక్కువ..అంటూ తెగ ఆశ్చర్యపోతూ కామెంట్ చేసింది.
ఒక్క ఐస్ ల్యాండ్ మాత్రమే కాదు...ఇటు ఆస్ట్రేలియా, యూరప్ కంట్రీస్ కూడా ఈ జన సందోహాన్ని, క్రికెట్ లవర్స్ ను చూసి చాలా ఆశ్చర్యపోతున్నారట. భారతీయులు క్రికె్ట్ ను ఎంత ఆధరిస్తారో అందరికి తెలిసిందే...గల్లీ నుంచి ఢిల్లీ వరకు ...క్రికెట్ అంటే పడిచస్తారు. ఈ విజయం వీరందరికి చాలా హ్యాపీ అయిందనే చెప్పాలి.
In this photo of India's World Cup party, you can see 20 times more people than our national population. pic.twitter.com/5sSujAeIfO — Iceland Cricket (@icelandcricket) July 4, 2024