సెకండ్ థర్డ్ సెషన్స్ వచ్చే సరికి భారత్ బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా కివీస్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 259 రన్స్ కు ఆల్ అవుట్.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పూణే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ భారత్ , న్యూజిల్యాండ్ మ్యాచ్ . ఈ మ్యాచ్ లో ఫస్ట్ సెషన్ లో న్యూజిలాండ్ బ్యాటర్ల ఆధిపత్యం ఉంది. అయితే సెకండ్ థర్డ్ సెషన్స్ వచ్చే సరికి భారత్ బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా కివీస్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 259 రన్స్ కు ఆల్ అవుట్.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన టీమిండియా న్యూజిలాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియానికి వచ్చిన అభిమానులు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి తన తప్పు తెలుసుకున్న మహారాష్ట్ర క్రికెట్ సంఘం అభిమానులకు ఓపెన్ గా సారీ చెప్పింది.
ఇంతకీ ఏం జరిగిందంటే .. క్రికెట్ చూడడానికి వచ్చిన వారికి మంచి నీరు సదుపాయం లేదు. ఆడియన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో స్టేడియంకు వచ్చిన వారు మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్ వాటరే కాదు ..కొనుక్కొని తాగాలన్నా మంచినీరు లేదు. ఒక వైపు ఎండ మరో వైపు తాగునీటి కొరతతో చాలా ఇరిటేట్ అయ్యారు. అందుకు వీరికి సారీ చెప్పింది మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. చివరికి వచ్చినవారికి క్షమాపణలు చెబుతూ ...ఫ్రీ వాటర్ బాటిల్స్ కూడా పంచిపెట్టారు . అదీ సంగతి.