dhoni: కూతురితో ధోనీ ఫారిన్​ ట్రిప్- బీచ్​లో రిలాక్స్ అవుతున్న మహీ !


మహీ బీచ్​లో ఉండగా, జీవా ఒడ్డున నిలబడి తన తండ్రిని చూస్తూ అలలతో ఆడుకుంటుంది. కళ్లద్దాలు ధరించిన ధోనీ చాలా స్టైలిశ్​ లుక్ లో  కనిపిస్తున్నాడు.


Published Nov 09, 2024 03:23:00 PM
postImages/2024-11-09/1731146134_zivaandmsdhoni09150932116x90.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నారు. మిస్టర్ కూల్ ధోని సార్ తన ఫ్యామిలీ తో కలిసి ఫారన్ ట్రిప్ కు చెక్కేశారు. థాయ్ లాండ్ బీచ్ లో కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తుననారు. అంతే కాదు తన కూతురు జీవా సింగ్ తో ధోనీ సరదాగా ఆడుకుంటూ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు.


మహీ బీచ్​లో ఉండగా, జీవా ఒడ్డున నిలబడి తన తండ్రిని చూస్తూ అలలతో ఆడుకుంటుంది. కళ్లద్దాలు ధరించిన ధోనీ చాలా స్టైలిశ్​ లుక్ లో  కనిపిస్తున్నాడు. ఫొటోల్లో జీవా కూడా క్యూట్​గా కనిపిస్తోంది. సన్​సెట్ ఫొటోలు సైతం జీవా ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ పిక్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మహీ గారాలపట్టి జీవా సింగ్​కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ చిన్నారి ఆకౌంట్​ను 28 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. తన క్యూట్ పిక్స్ అన్నీ ఇక్కడ షేర్ చేస్తూ అటు ఫ్యామిలీ ట్రిప్స్ ను ...ఇటు సోషల్ మీడియా లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.ఇక ధోని ప్రొఫిషినల్ లైఫ్  చూస్తే  2025 ఐపీఎల్​లో ధోనీ బరిలో దిగనున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ లో ధోని రిటైన్డ్ ప్లేయర్. రూ. 4 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. 2024 సీజన్​లో 14సార్లు బ్యాటింగ్​కు వచ్చిన మిస్టర్ కూల్ సిక్స్​లతో స్టేడియాలను మార్మోగించాడు. ప్రతి యేడాది ఫ్యామిలీ తో ట్రిప్ లానే ఈ ఏడాది థాయిల్యాండ్ ప్లాన్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మిస్టర్ కూల్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ms-dhoni jeeva beachroad thailand-

Related Articles