CBSE Borad Exams: సీబీఎస్ఈ 10, 12వ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ !


Published Nov 21, 2024 01:48:00 PM
postImages/2024-11-21/1732177139_CBSEregistrationforclasses910tobeginfrom151170x780.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  సీబీఎస్ఈ డేట్ షీట్ 2025 విడుదలైంది . 10 వతరగతి, 12 వతరగతి పరీక్షల షెడ్యూల్ ను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఫిబ్రవరి 15 ,2025 న 10,12 వ తరగతుల ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నట్లు తెలిపాయి, అయితే 12 వ తరగతి పరీక్షలు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సబ్జెక్ట్ తో మొదలవుతాయి. సీబీఎస్ఈ.గవ్.ఇన్‌ (cbse.gov.in) పోర్టల్‌పై పరీక్షలకు సంబంధించిన వివరాలు తెలిపారు.


మొదటిసారిగా పరీక్షల ప్రారంభానికి దాదాపు 86 రోజులు ముందుగానే షెడ్యూల్ ప్రకటించామని సీబీఎస్ఈ పేర్కొంది. దీని వల్ల పిల్లలు ప్రిపరేషన్ కు హెల్ప్ అవుతుంది. అయితే గతేడాది పోల్చితే 23 రోజులు ముందుగా పరీక్షల డేట్స్ వచ్చాయి. స్కూల్స్ ఆన్ టైం లో ఎల్ వోసీ సమర్పించడంతో ఇంత త్వరగా షెడ్యూల్ ప్రకటించడం జరిగిందన్నారు. 
కాగా 10వ, 12వ తరగతులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను సీబీఎస్ఈ ఇటీవలే విడుదల చేసింది. 10వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1, 2025 నుంచి మొదలవుతాయి. 12వ తరగతి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది. అయితే ముందే షెడ్యూల్ ఇవ్వడం కూడా పిల్లలకు ప్రిపరేషన్ కు చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu comptetive-exams education

Related Articles