ఇద్దరి జీతాలు..నో కిడ్స్ ఇదే అసలైన అర్ధం. అయ్యోయ్యో ఇదేం విడ్డూరం అంటారేమో. అసలు ఖర్చులు చూసి ఎవరైనా ఇదే అంటారు. కాని సింగిల్ కిడ్ తో చాలనుకునేవారే ఎక్కువ.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్లంతా సింగిల్ వర్డ్ కి స్టిక్ అయ్యి ఉంటున్నారు. అసలు DINK అంటే ఏంటి ...యూత్ ఎందుకు ఈ డింక్ చుట్టు లైఫ్ ను ముడివేస్తున్నారు. ఫస్ట్ డింక్ అంటే ఏంటో తెలుసుకుందాం. డింక్ అంటే ...డ్యూయల్ ఇన్ కమ్ ...నో కిడ్స్ . ఇద్దరి జీతాలు..నో కిడ్స్ ఇదే అసలైన అర్ధం. అయ్యోయ్యో ఇదేం విడ్డూరం అంటారేమో. అసలు ఖర్చులు చూసి ఎవరైనా ఇదే అంటారు. కాని సింగిల్ కిడ్ తో చాలనుకునేవారే ఎక్కువ.
అసలు ఏం ఖర్చులు రా నాయనా ...నర్సరీ కూడా లక్షల్లో అవుతుంది. పిల్లలంటే ఖర్చులు ఇప్పుడు యూత్ లో ఇదే నడుస్తుంది. పిల్లలు ఖర్చుతో కూడుకున్న మెంటల్ ప్రెజర్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
పిల్లలు ఉంటే భార్యా భర్తల మధ్య అస్సలు ప్రైవసీ ఉండదు. కాబట్టి నో కిడ్స్ అంటున్నారు.
కిడ్స్ ఉంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెయ్యలేం. పిల్లలు కంటే పెట్స్ బెటర్ అని ఆలోచిస్తున్నారు.
యూత్ లో దాదాపు 40 శాతం మంది ఈ నో కిడ్స్ ..డ్యూయల్ ఇన్ కమ్ కే ఓటు వేస్తున్నారు. కారణం ఒక్కటే ప్రైవేట్ లైఫ్ ను ఎంజాయ్ చెయ్యడమే ఫస్ట్ ప్రయారిటీ. అందుకే ఇప్పటి యూత్ డింక్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.