Royal Enfield EV Bike : రాయల్ ఎన్‌‌ఫీల్డ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ !

ఈ కొత్త మోడల్ బైకును (FF-C6) అని పిలుస్తారు. (RE)రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను (EICMA 2024)కి ముందు ప్రదర్శించింది. ఈ ఎఫ్ఎఫ్-సీ6 ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ మోడల్ అడ్వాన్స్‌‌డ్ వెర్షన్ అని చెప్పవచ్చు.


Published Nov 05, 2024 08:57:00 PM
postImages/2024-11-05/1730820483_royalenfieldclassic350.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రాయల్ ఎన్ ఫీల్డ్ క్రేజ్ ఏ లెవెల్ లో ఉంటుంది..ఇండియన్ కుర్రాళ్లను అడగాలి. అసలు రాయల్ ఎన్ ఫీల్డ్ క్రేజ్ ఏ మోడల్ దిగినా ..ఎంత రేటు పెట్టినా ..కళ్లకు అద్దుకొని తీసుకుంటారు. బైకర్స్ కి ...రైడర్స్ కు రాయల్ ఎన్ ఫీల్డ్ సూపర్ కంఫర్టబుల్. అందుకే రాయల్ ఎన్ ఫీల్డ్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ దింపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌లను అందించడంలో ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బ్రాండ్ కింద మొదటి మోడల్ 2026లో మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త మోడల్ బైకును (FF-C6) అని పిలుస్తారు. (RE)రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను (EICMA 2024)కి ముందు ప్రదర్శించింది. ఈ ఎఫ్ఎఫ్-సీ6 ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ మోడల్ అడ్వాన్స్‌‌డ్ వెర్షన్ అని చెప్పవచ్చు.


అయితే ఈ ఫోర్క్ కాస్త ఫ్రంట్ సస్పెన్షన్ అల్యూమినియం గిర్డర్ ఫోర్క్ తో కూడిన మడ్ గార్డ్ ఉంటుంది. అంతేకాదు ఇది 1930 లో మోటర్ సైకిల్ మోడల్ ను కలిగి ఉంటుంది. అప్పుడు మెగ్నీషియం బ్యాటరీ కేసుతో నడిచే ఫేక్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది.. రౌండ్ హెడ్ ల్యాంప్ హౌసింగ్ , సింగిల్ పాడ్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్ కూడా క్లాసిక్ వైబ్ లను అందిస్తాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్ గత 6 నెలల్లోనే 28 పేటెంట్‌లను దాఖలు చేసినట్లు పేర్కొంది. ఇవన్నీ మేకిన్ ఇండియన్ థీమ్ లాగే. దీనిని (S6) అని పిలుస్తారు. (C6) ఒక కాన్సెప్ట్ అయినందున, 2026 ప్రారంభంలో కన్నా ముందు తుది ఉత్పత్తికి కొన్ని మార్పులు ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. రేటు ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu electric-bike

Related Articles