HEALTH: డియర్ లేడీస్ ..30 యేళ్లు దాటితే ఈ ఫుడ్ తీసుకోవాల్సిందే ..!

పీసీఓడీలు.. ఒక్కటి కాదు ...అన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్. అన్ని ఇన్నీ కాదు. అందుకే ఆడవారు ముప్పై వస్తే చాలు కొన్ని ఫుడ్స్ ఇష్టంలేకపోయినా తినాల్సిందే. ఆరోగ్యసమస్యలు రావడం మొదలవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. 


Published Jul 31, 2024 01:03:31 AM
postImages/2024-07-31/1722405796_HEALTH.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో 20 యేళ్లకే ఒళ్లు నొప్పులు..ఆడవారంటే మరీ దారుణం ..వయసుతో సంబంధం లేకుండా అందరికి ఇబ్బందులే. పీసీఓడీలు.. ఒక్కటి కాదు ...అన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్. అన్ని ఇన్నీ కాదు. అందుకే ఆడవారు ముప్పై వస్తే చాలు కొన్ని ఫుడ్స్ ఇష్టంలేకపోయినా తినాల్సిందే. ఆరోగ్యసమస్యలు రావడం మొదలవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. 


ఎండు ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.  దీని వల్ల ఆడవాళ్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండడమే కాదు. ఎండుద్రాక్ష తినడం వల్ల.. శరీరంలో రక్త హీనత తగ్గిపోతుంది. శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది.  మీకు కాని పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తే ఈ ఎండుద్రాక్ష సూపర్ ఫుడ్. చక్కగా డేట్స్ రెగ్యులర్ అయ్యి యుట్రస్ హెల్త్ ను కాపాడుతుంది.


2.ఉసిరి..
మహిళల డైట్ లో భాగం చేసుకోవాల్సిన మరో సూపర్ ఫుడ్ ఉసిరి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళలకు చాలా అవసరం. అంతేకాదు... ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా హార్మోన్స్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా ఉంచుతుంది.


3.దానిమ్మ...
వారానికి 1-2 సార్లు మీ ఆహారంలో దానిమ్మపండు ఉండేలా చూసుకోండి. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ను తగ్గించడమే కాదు...గుండె ఇబ్బందులు రాకుండా చేస్తుంది.


4. బొప్పాయి
బొప్పాయి కాలేయానికి కూడా చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. స్కిన్ ను క్లియర్ గా ఉండేలా చేస్తుంది.
వీటితో పాటు అవిసగింజలు, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ లాంటివి చేర్చుకుంటే లేడీస్ హెల్త్ కి మరింత మంచిది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health hair-growth ladies

Related Articles