రతన్ టాటాను వ్యాపారవేత్త అనకూడదేమో. వ్యాపారం అంటే లాభాలు ఆశించాలి. తను చేసే బిజినెస్ లో లాభాల మాట పెద్దగా లేకపోయినా పెట్టుబడులు పెట్టేవారిని వ్యాపారవేత్త అనకూడదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రతన్ టాటా యావత్ ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తి . ఆయన మరణం జీర్ణించుకోలేనిది. వృధ్దాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఉప్పు నుంచి కార్ల వరకు ప్రతి రంగంలోను టాటా తన మార్కును ఉంచింది. రతన్ టాటాను వ్యాపారవేత్త అనకూడదేమో. వ్యాపారం అంటే లాభాలు ఆశించాలి. తను చేసే బిజినెస్ లో లాభాల మాట పెద్దగా లేకపోయినా పెట్టుబడులు పెట్టేవారిని వ్యాపారవేత్త అనకూడదు.
బిజినెస్ ఒక్కటే కాదు దేశం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. పేదలను ఆదుకునేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివి. సినీ నిర్మాతగా తన లక్ ని పరీక్షించుకున్నాడు. సినిమాలంటే ఇష్టం ఉన్న ఆయన ఓ సినిమా కూడా నిర్మించారు. కాని పెద్దగా లాభాలు లేవు. దీంతో ఇక సినిమాలు చెయ్యలేదు.
అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ అనే మూవీ. బిగ్ బీ నటించిన ఏత్ బార్ అనే చిత్రానికి రతన్ టాటా నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాకు నలుగురు నిర్మాతల్లో రతన్ టాటా ఒకరు. అయితే రతన్ టాటానే ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 7.50 కోట్లు మాత్రమే రాబట్టింది. డిజాస్టర్ సినిమా గా పేరు పడింది. లాభాల్లేవు అలా అని భయంకరమైన నష్టం కాదు. ఇక దీంతో రతన్ టాటా సినిమాల వైపు వెళ్లలేదు. చాలా యేళ్ల తర్వాత రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన విషయం వైరల్ అయ్యింది. కాని ఇక రతన్ టాటా సినిమాల వైపు వెళ్లలేదు.