Chevella: సీఎం క్షమాపణ చెప్పాలి

తెలంగాణ ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి చర్యల వల్ల రాష్ట్ర ఆడబిడలకు అవమానం జరిగిందని అన్నారు. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


Published Aug 01, 2024 04:00:00 PM
postImages/2024-08-01/1722507134_chevella.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ఆడబిడ్డలు, బీఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేవెళ్ల BRS కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బుధవారం అసెంబ్లీలో జరిగిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డిని అవమానించే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి చర్యల వల్ల రాష్ట్ర ఆడబిడలకు అవమానం జరిగిందని అన్నారు. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

రేవంత్ దుర్మార్గమైన చర్యను తెలంగాణ ప్రజానీకం చూస్తోందని అన్నారు. అందుకు తగిన గుణపాఠం త్వరలోనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మాజీ ఎంపీపీ మంగల్ బాల్ రాజ్, దేశముల ఆంజనేయులు, కార్యకర్తలు, BRS పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu brs malasabitha

Related Articles