FRIDAY : నాగపంచమి పూజలు.. కిటకిటలాడుతున్న దేవాలయాలు !

ఆగస్టు 8వ తేదీ రాత్రి 9.56 నిమిషాలకు నాగ పంచమి ఘడియలు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11.59 నిమిషాల వరకు కొనసాగుతుంది. 


Published Aug 09, 2024 08:12:00 AM
postImages/2024-08-09/1723171430_SRAVANAMASAM.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శ్రావణ పంచమి నేడు ...హిందువులు అత్యంత భక్తి భావంతో నాగదేవతను పూజించే శుభదినం ప్రతీ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు వస్తుంది. దీనినే గరుడ పంచమిగా కూడా జరుపుకుంటారు.ఇక ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి 9.56 నిమిషాలకు నాగ పంచమి ఘడియలు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11.59 నిమిషాల వరకు కొనసాగుతుంది. 


ముఖ్యంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సంవత్సరం పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు నాగుల పంచమి రావడం కూడా విశేషయోగంగా చెబుతారు. నాగపంచమి పై పురణాల్లో వేల కథలు చెబుతున్నాయి. అన్ని కథలు ఆదిశేషుని పూజించడం చాలా మంచిదనే చెబుతున్నాయి. నాగ దేవతతో పాటు శివుడిని ఆరాధించడం వలన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు పోయి శుభాలు జరుగుతాయని నముతారు. గరుడ పురాణం చెప్పిందిదే మహాభారతం, గరుడ పురాణం, నారద పురాణం, రామాయణం, స్కంద పురాణం, వంటి వివిధ పౌరాణిక గాధలలో సర్పాలతో మనుషులకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి.


అసలు ఈ పంచమి ఎందుకు చేస్తారంటే ...ఇంతకు ముందంతా...అందరు వ్యవసాయమే ప్రధానవృత్తి గా బతికే వాళ్లం. భూముల్లో పాము పుట్టలు ఉండడం సహజమే కదా...అవి మనుషులకు ప్రమాదం కలిగించకుండా నారాయణుడు ఆదిశేషునికి ఓ వరం ఇచ్చాడట. మనుషులంతా శ్రావణ పంచమికి పూజలు చేస్తారు...పాములు వారి కంటపడకుండా ...వారిని ఇబ్బందిపెట్టకుండా ఉండాలని..అందుకే శ్రావణ పంచమి పూజలు పొలంలో చేసి చివర్లో పుట్టమన్ను తో నీటితో ఒక గీత గీస్తారు. అంటే స్వామి ..గీత కు అవతల వైపు జనసంచారముంది ...ఈ ఏడాది పాటు ...మాకు కంటపడకు...మా వల్ల ఇబ్బందులు పడకు అని నమస్కారం చేసుకుంటారు అని మొక్కుతారు. అందుకే శ్రావణ పంచమి చేసుకుంటారని ప్రతీతి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sravanam pooja

Related Articles