ODI Match: స్వల్ప స్కోర్‌కే లంక.. భారత్ లక్ష్యం ఎంతంటే

శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.


Published Aug 02, 2024 06:56:52 PM
postImages/2024-08-02/1722605212_lan22.PNG

న్యూస్ లైన్ డెస్క్: శ్రీలంక వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పాతుమ్ నిస్సాంక(56), దునిత్ వెల్లలాగే(67) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వనిందు హసరంగా(24) ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక జట్టు 230 పరుగులకే పరిమితమైంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(1)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కుసల్ మెండిస్(14), సదీర సమరవిక్రమ(8) పరుగులు స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. దాంతో లంక జట్టు మూడు వికెట్లు కోల్పోయి 40 రన్స్ కొట్టింది. కాగా, ఓవైపు వికెట్లు పడుతున్న భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పాతుమ్ నిస్సాంక తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విధ్వంకర ఇన్నింగ్స్‌తో నిస్సాంక( 75 బంతుల్లో 56 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్సర్ల) సహయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో జనిత్ లియానాగే కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి కలిసి లంక స్కోర్ బోర్డుకు 50 రన్స్ జతచేశారు. అయితే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో నిస్సాంక(56) ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఆ కాసేపటీకే లియానాగే(20) ఔటయ్యాడు. దాంతో శ్రీలంక మీడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన దునిత్ వెల్లలాగే ధనాధన బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వనిందు హసరంగాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు. అయితే హసరంగా(24)ను అర్ష్‌దీప్ సింగ్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులో దిగిన అకిల దనంజయ మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక వెల్లలాగే హార్డ హిటింగ్ బ్యాటింగ్‌తో (63 బంతుల్లో 63 రన్స్ 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఫిఫ్టి పూర్తి చేశాడు. ఇక వీళ్లిందరూ చివరి వరకు నిలబడి శ్రీలంక జట్టుకు భారీ స్కోర్ అందించారు. దీంతో లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండు  వికెట్లు పడగొట్టాగా.. శివం దూబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ తీశారు.
 

newsline-whatsapp-channel
Tags : odi-match india-team cricket-news srilanka

Related Articles