మందు షాపు బంద్ అంటే సగం మంది మందు ప్రియులు డీలా పడిపోతారు. అయితే నిజమే హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మందు షాపు బంద్ అంటే సగం మంది మందు ప్రియులు డీలా పడిపోతారు. అయితే నిజమే హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ ప్రాప్రయిటరీ క్లబ్‌లు, స్టార్ హోటల్లు, రెస్టారెంట్లతోపాటు అన్ని వైన్ షాపులు మూసివేయపడతాయని సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చత్రినాక, షాలిబండ, మీర్‌చౌక ప్రాంతాల్లో జులై 8న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, మందు షాపులు మూసి ఉంటాయని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఆషాఢ మాసం లో శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీ మీదుగా సంబరాలు అంబరాన్ని అంటుకునేలా చేస్తారు. అయితే ఆ హడావిడిలో తాగి గొడవలు పడడం లాంటి ఇన్సిడెంట్స్ ను అవాయిడ్ చేస్తున్నారు అధికారులు.