టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. అయితే దక్షిణాఫ్రికా వాళ్లు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ ( SURYA KUMAR YADAV) బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా పట్టిన క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: T 20 వరల్డ్ కప్( T 20 WORLD CUP) 2024 ఫైనల్ మ్యాచ్ భారత్( BHARATH) గెలిచి సంబరాల్లో ఉంది. ఇరు జట్లు హోరాహోరీ గా తలపడ్డాయి. టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. అయితే దక్షిణాఫ్రికా వాళ్లు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ ( SURYA KUMAR YADAV) బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా పట్టిన క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. అయితే క్రీజులో కదలకుండా నిల్చున్న స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఔట్ కావడం భారత్ బూస్ట్ ఇచ్చింది. సగం ...సక్సస్ ను కన్ఫర్మ్ చేసింది కూడా ఈ క్యాచే.
బౌండర్ రోప్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఔట్ కాదని సిక్సర్ అని అంటున్నారు దక్షిణాఫ్రికా ప్రజలు. మళ్లీ మళ్లీ వీడియో చూస్తూ జూమ్ చేసి ఉన్న ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ కాలు బౌండరీ రోప్‌ను తాకిందని దక్షిణాఫ్రికా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఔట్ అని నిర్ధారించడానికి ముందు థర్డ్ అంపైర్లు మరింత జాగ్రత్తగా చెక్ చేసి ఉండాల్సిందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఔట్ ఇవ్వకుంటే బాగుండేదని అంటున్నారు.
This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves.