మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన పోరులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన పోరులో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత బ్యాటర్లు షఫాలీ వర్మ అర్ధ సెంచరీతో నేపాల్ బౌలర్లకు ఊచకోత చూపించగా.. దయలాన్ హేమలత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. దాంతో భారత్, నేపాల్ జట్టుపై 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళ జట్టుకు ఓపెనర్లు సాలిడ్ స్టార్ట్ అందించారు. ఓపెనర్ షఫాలీ వర్మ, దయలాన్ హేమలత ఇద్దరూ నేపాల్ బౌలర్లపై రెచ్చిపోయారు. హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేస్తూ స్టేడియంలో పరుగుల వరద పారించారు. ఇక షఫాలీ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. వేగంగా రన్స్ స్కోర్ చేస్తూ షఫాలీ( 26 బంతుల్లో 52 పరుగులు 8 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసింది. మరో ఎండ్‌లో హేమలత కూడా దూకుడు బ్యాటింగ్ చేసింది. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించింది. హేమలత 42 బంతుల్లో 47 రన్స్ చేసింది. ఈ జోడి కలిసి జట్టు స్కోర్ బోర్డుకు 120 పరుగులు జతచేశారు. అయితే మంచి టచ్‌లో ఉన్న హేమలత(47)ను సీతా రాణా మగర్ పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత షఫాలీ వర్మ(81) కూడా ఔట్ అయ్యింది. దాంతో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 130 రన్స్ కొట్టింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ సజన(10) అంతగా రన్స్ స్కోర్ చేయలేకపోయింది. ఇక చివరిలో జెమిమా రోడ్రిగ్స్, రీచా గోష్ 40 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు సీతా రాణా మగర్ రెండు వికెట్లు పడగొట్టాగా.. కబితా జోషి ఒక వికెట్ తీసింది.
భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంఝనా ఖడ్కా(7)ను అరుంధతి రెడ్డి క్లీన్ బౌల్డ్ చేయగా.. సీతా రాణా మగర్(18) పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత కబితా కున్వర్(6), కెప్టెన్ ఇందు బర్మా(14)లను రేణుకా సింగ్ వెనక్కి పంపింది. దాంతో నేపాల్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రుబీనా ఛెత్రీ(15), కబితా జోషి(0), డాలీ భట్టా(5), పూజ మహతో(2)లు పరుగులు చేయడంలో నిరశా పరించారు. అఖరిలో బిందు రావల్(17 నటౌట్), కాజల్ శ్రేష్ఠ(3) పోరాటం చేసిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. 20 ఓవర్లలో 96 పరుగులకే చేసింది. దాంతో టీమిండియా జట్టు, నేపాల్ పై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.