Cabinet: గ్రూప్ 1,2 ఉద్యోగాలపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

గ్రూప్ 1,2 ఉద్యోగాలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.


Published Aug 01, 2024 07:59:21 AM
postImages/2024-08-01//1722514672_gmcb.PNG

న్యూస్ లైన్ డెస్క్: గ్రూప్ 1,2 ఉద్యోగాలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జాబ్‌ క్యాలెండర్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్‌ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నారు. కొత్త రేషన్‌ కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉంటారు. ధరణి పోర్టల్‌ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్ట్ కింద సాగర్‌లోని ఓ మండలం ఎంపిక చేసింది. 

ఈ గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే వయనాడ్‌ మృతులకు తెలంగాణ కేబినెట్ సంతాపం తెలిపి వయనాడ్ బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియ‌న్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 పోస్టు ఇవ్వలని నిర్ణయం తీసుకుంది. ఇక గ్రూప్ 1 కేడర్ లో ఇద్దరు డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో ఔట‌ర్ గ్రామాల విలీనానికి కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క‌మిటీలో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, శ్రీధ‌ర్ బాబు, సీత‌క్క స‌భ్యులుగా ఉంటారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy meet

Related Articles