Teachers: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపిక

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ’’ అవార్డుకు ఎంపికయ్యారు.


Published Aug 28, 2024 09:16:22 AM
postImages/2024-08-28/1724853062_national.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ’’ కు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా, తెలంగాణ నుంచి మొత్తం ఆరుగురి పేర్లను రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదించగా ఇందులో ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు.

ఈ అవార్డు గ్రహీతల్లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పాఠశాల ఉపాధ్యాయుడు పెసర ప్రభాకర్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాద్యాయుడు తండూరి సంపత్ కుమార్ ఎంపికయ్యారు. సంతోష్ కుమార్ తెలంగాణ నుంచి 2021, 2022 జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యాడు. పాఠశాల పటిష్టతను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించారు. అతని నిరంతర కృషి కారణంగా 2012-13 విద్యా సంవత్సరంలో సంస్థ నమోదు 130 నుంచి 2022-23 నాటికి 215కి పెరిగింది. ఇక స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తరపున తెలంగాణలోని 10,000 మంది ఉపాధ్యాయులకు ఐసీటి టూల్స్, సీసీఈ, కొత్త పాఠ్యపుస్తకాలు, ఇతర విషయాలపై సంతోష్ ఇన్-సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చారు. వీరికి సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

newsline-whatsapp-channel
Tags : india-people national government-schools teacher

Related Articles