అప్పుడు రాఖీ కట్టించారు ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నారు.!

నా పేరు శివ నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మా పక్కింట్లో ఒక కుటుంబం అద్దెకు ఉండేది. వాళ్ళ అమ్మాయి నాకంటే  ఒక సంవత్సరం చిన్నది.  ఆమె పేరు దివిజ.  పక్కింట్లో ఉంటుంది


Published Aug 24, 2024 09:04:08 AM
postImages/2024-08-24/1724470448_rakhi.jpg

న్యూస్ లైన్ డెస్క్: నా పేరు శివ నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మా పక్కింట్లో ఒక కుటుంబం అద్దెకు ఉండేది. వాళ్ళ అమ్మాయి నాకంటే  ఒక సంవత్సరం చిన్నది.  ఆమె పేరు దివిజ.  పక్కింట్లో ఉంటుంది కాబట్టి ఆమె నాతో బాగా మాట్లాడేది.  అలా కొన్నాళ్ల తర్వాత నాకు కాస్త ఆమెపై ప్రేమ పెరిగింది. కానీ నా మనసులోనే ఉంచుకున్నాను. ఇంతలో ఆ అమ్మాయి  రాఖీ పౌర్ణమి రోజు నాకు రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది.

దీంతో నా చిగురిస్తున్న ప్రేమను మొగ్గలోనే తుంచేసాను. ఇక మెల్లిమెల్లిగా చెల్లి అనడం మొదలు పెట్టాను.  ఇక ఇద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం గట్టిగా బలపడింది. సంవత్సరాలు గడిచింది. ప్రజెంట్ నాకు  ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో మా పక్కింట్లో ఉండేవారు  మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ తో మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి చేద్దాం అనే ప్రపోజల్ పెట్టారు. కానీ నేను దీనికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు.. నా పాత ప్రేమను బయటకు తీసి ఒప్పుకోవాలా..చెల్లిగానే చూడాలా.. ఏం చేయాలో అర్థం అవడం లేదు..

 నిపుణుల సమాధానం:
 నిజానికి నీకు వచ్చిన సమస్య చాలా జఠిలమైనది. ముందుగా ఆమెతో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ప్రేమను చంపుకొని చెల్లిగా భావించారు. చివరికి వారి నుంచే ఆమెను చేసుకోవాలని పెళ్లి ప్రపోజల్ వచ్చింది. ఆమెకు మీరు ఏ స్థానం ఇవ్వాలో  అర్థం కాని పరిస్థితిలో పడ్డారు. ఒకవేళ ఆమెపై పాత ప్రేమను పెంచుకున్నా, చెల్లి అని పిలిచారు కాబట్టి ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవడం సమంజసం అనిపించుకోదు. పెద్దల ఒత్తిడి వల్ల మీరు పెళ్లి చేసుకున్న  మనసులో ఏదో ఒక మూలన చెల్లి అనే భావన కలుగవచ్చు. ఈ సమయంలో నిజంగా ఆ అమ్మాయికి కూడా నీపై ప్రేమ ఉందా అనే విషయాన్ని తప్పక తెలుసుకోండి.

నిన్ను భర్తగా ఊహించుకుంటుందా లేదంటే అన్నయ్య అనే గానే ఊహించుకుంటుందా అనే విషయాన్ని క్లారిటీ వచ్చాక మీ నిర్ణయాన్ని చెప్పండి. జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి తప్పక మీరు ఆచితూచి అడుగు వేయాలి. తల్లిదండ్రుల ఒత్తిడి చేశారని  మీరు భార్యగా చేసుకుంటే  తర్వాత బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక రాఖీ కట్టిన అమ్మాయిని మళ్లీ భార్యగా ఊహించుకోవడం కష్టం..  కాబట్టి అమ్మాయి నువ్వు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి.  ఓకే అయితే ఓకే చెప్పండి. లేదంటే మా ఇద్దరి మధ్య సెట్ కాదని డైరెక్ట్ గా మీ అమ్మానాన్నలతో చెప్పండి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige rakhi brother sister

Related Articles