ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దసరా పండుగ కు ఆఫర్ ఇచ్చినట్లుంది బంగారం యవ్వారం. పెరగడం వేలల్లో తగ్గడం పదుల్లో తగ్గుతుంది. ఈ రోజు బంగారం ధర గ్రాము మీద 10 రూపాయిలు తగ్గింది. ఉదయం 6 గంటలకు నమోదైన రేట్ల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 మేరకు తగ్గింది.
ఓ 15 రోజుల నుంచి బంగారం ధర గ్రాము మీద 850 నుంచి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు గత మూడు రోజుల నుంచి బంగారం ధర 10 , 20 రూపాయిలు తగ్గుంది. ఇక24 క్యారట్లు బంగారం రూ.77,660గా ఉంది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,190 ఉంది.
తగ్గినట్టే తగ్గి.. భారీగా పెరిగిన వెండి ధరలు.. మళ్లీ పండుగ తర్వాత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ. 100 మేరకు తగ్గింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో ఇవాళ కిలో వెండి ధర రూ. 1,02,900గా ఉంది. ముంబై, పూణే, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ. 96,900గా ఉంది.ఢిల్లీ , ముంబై , కర్ణాటక ఇక అన్ని రాష్ట్రాల్లోను బంగారం ధర ఇలానే ఉన్నాయి. వెండి ధర మాత్రం కలకత్తా , బెంగుళూరు నార్మల్ ధరల కంటే కేజీ మీద 4 వేల తక్కువ గా ఉంది.