ఈ ప్రకృతి విపత్తు నుంచి నోరు లేని మూగ జీవులను కాపాడడానికి ప్రత్యేకమైనవారు ఎవ్వరు లేరు. తమను తామే కాపాడుకోవడం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రకృతి విధ్వంసం మొదలుపెడితే ఎలా ఉంటుందో సాంపిల్ చూపించింది వయానాడ్ ఘటన. దాదాపు 400 మంది చనిపోయారు..మరో 200 మంది గల్లంతయ్యారు. ఎక్కడున్నారో ..బతికే ఉన్నారో లేదో తెలీదు. ఈ విధ్వంసంలో మనుషుల్ని కాపాడడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. కాని ఈ ప్రకృతి విపత్తు నుంచి నోరు లేని మూగ జీవులను కాపాడడానికి ప్రత్యేకమైనవారు ఎవ్వరు లేరు. తమను తామే కాపాడుకోవడం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.
రెండు కోతి పిల్లలు ..వరద భీభత్సానికి చూసి భయపడుతూ వణుకుతూ ...ప్రాణ భయంతో ఉణ్న వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఒకదాన్ని ఒకటి పట్టుకొని అమాయకంగా చూస్తున్న కోతి పిల్లలు ఆకలితో నిస్స హాయ స్థితిలో ఉన్నట్లు వీడియోలో తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఫుల్ వైరల్ అవుతుంది. జంతుప్రేమికులకు ఇది కన్నీళ్లు పెట్టించే వీడియోగా చెబుతున్నారు నెటిజన్లు.
కేరళ రాష్ట్రం వాయనాడులో జరిగిన విధ్వంసం తరువాత ఒక కోతి పిల్ల తనకన్నా చిన్న పిల్లను కాపాడుతున్న విధానం చూసయినా మనం మన సాటి మనిషికి ఆపదలో సహాయం చేయాలని తెలుసుకోవాలి.#floods #rains #WayanadLanslide #WayanadDisaster #KeralaFlooding #AadhanTelugu pic.twitter.com/gg98m8cnox — Aadhan Telugu (@AadhanTelugu) August 6, 2024