YOGI BABU: 'చట్నీ సాంబార్' వెబ్ సీరిస్ రివ్యూ !

కోలివుడ్ కమెడియన్ యోగిబాబు ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ . మెయిన్ లీడ్స్ చేస్తూనే ...కామెడీ క్యారక్టర్లు కూడా చేస్తున్నారు. అటు సినిమా లు ఇటు వెబ్ సిరీస్ ల పై కూడా దృష్టి పెట్టాడు.


Published Jul 29, 2024 11:54:19 AM
postImages/2024-07-29//1722234259_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కోలివుడ్ కమెడియన్ యోగిబాబు ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ . మెయిన్ లీడ్స్ చేస్తూనే ...కామెడీ క్యారక్టర్లు కూడా చేస్తున్నారు. అటు సినిమా లు ఇటు వెబ్ సిరీస్ ల పై కూడా దృష్టి పెట్టాడు. లేటెస్ట్ రిలీజ్ 'చట్నీ సాంబార్' వెబ్ సిరీస్ హార్ట్ స్టార్ లో దుమ్ముదులిపేస్తుంది. రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 26వ తేదీ నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.6 ఎపిసోడ్స్ చాలా బాగా ప్లాన్ చేశారు. కామెడీ , ఎమోషనల్ గా సీరిస్ ను నడిపించారు.


ఊటీలో రత్నస్వామి (నిళల్ గల్ రవి) 'అముద' పేరుతో ఒక హోటల్ నడుముతూ ఉంటాడు. తన హోటల్ లో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది.భార్య జయలక్ష్మి (మీరా కృష్ణన్) కొడుకు కార్తిక్ (చంద్రన్) కూతురు అముద (మైన నందిని) ఆమె భర్త .. ఇదే అతని కుటుంబం. రత్నస్వామి  చెన్నై లో ఉన్నపుడు ..కెరియర్ మొదట్లో ఓ అమ్మాయితో కలిసి ఉంటాడు. ఇద్దరికి ఓ కొడుకు ఉంటాడు. కాని వాళ్లను వదిలేసి ..మరో పెళ్లి చేసుకొని ఊటీ లో సెటిల్ అయిపోతాడు.


రత్నస్వామి చనిపోయే ముందు ..యోగిబాబుని కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలని కోరుతాడు. యోగి బాబు మాత్రం ఎక్కడో చైన్నై లో ఇడ్లీ బండి పెట్టుకొని బతుకుతాడు . అతను చేసే చట్నీకి మంచి గిరాకీ. కార్తీక్ ద్వారా జరిగింది తెలుసుకున్న సచిన్ ముందుగా రానంటాడు. ఎంత బ్రతిమాలినా రాడు . దీంతో మంచి ఫారన్ బ్రాండ్ మందు తాగించి రాత్రికి రాత్రే ఊటీ తీసుకువచ్చేస్తాడు కార్తీక్.


రత్నస్వామి ని యోగి బాబు కలుస్తాడు. కాని తండ్రి అంటే చిరాకు. సరిగ్గా మాట్లాడడు. యోగి బాబును చూడగానే  తన తండ్రి చాలా హ్యాపీగా ఫీలవుతారు. యోగిబాబు బాధ్యతను కొడుకు కార్తీక్ కు అప్పగిస్తారు. సచిన్ చేతుల మీదుగా జరగడం, జయలక్ష్మికీ ..ఆమె కూతురు అముదకి అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో వాళ్లకి అసలు విషయం చెబుతాడు కార్తీక్. అప్పుడు వాళ్లు ఎలా స్పందిస్తారు? సచిన్ కి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? 


దర్శకుడు రాధామోహన్ ఎంచుకున్న లైన్ మంచిదే. అన్ని వైపుల నుంచి కావాల్సినంత కామెడీని పిండుకోవడానికి అవకాశం ఉన్న కథనే. కామెడీకి చాలా స్కోప్ ఉన్నా...పెద్దగా కామెడీని వర్కవుట్ చెయ్యలేకపోయారు. అసలైన కథను కరెక్టుగా అల్లుకోకపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. అనవసరమైనవిగా అనిపిస్తూ, పొడిపొడిగా కనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. తన పాత్రకి యోగిబాబు జీవం పోసినా, అతని స్థాయికి తగిన కామెడీ లేని కంటెంట్ గానే ఈ  సిరీస్ కనిపిస్తుంది. కాస్త అవసరం లేని టాపిక్స్ కూడా యాడ్ అయ్యాయి. కాస్త టైం వేస్ట్ అవుతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu webseries comedians

Related Articles