ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వన్ ప్లస్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే అద్భుతమైనటువంటి ఫీచర్స్ కలిగినటువంటి మొబైల్ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. అంతేకాకుండా కస్టమర్ల ఆదరణ కూడా పొందాయి. అలాంటి ఈ సందర్భంలోనే వన్ ప్లస్ నుంచి సరికొత్త మొబైల్ జూలై 16వ తేదీన ఇటలీలోని మీలాన్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. ఇంతకీ ఆ ఫోన్ ఏంటయ్యా అంటే వన్ ప్లస్ నార్డ్ 4. అయితే ఈ ఫోన్ గురించి ఇంకా ఏ వివరాలు బయటకు రాలేదు కాని లీకైన వివరాల ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకుందాం.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వన్ ప్లస్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే అద్భుతమైనటువంటి ఫీచర్స్ కలిగినటువంటి మొబైల్ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. అంతేకాకుండా కస్టమర్ల ఆదరణ కూడా పొందాయి. అలాంటి ఈ సందర్భంలోనే వన్ ప్లస్ నుంచి సరికొత్త మొబైల్ జూలై 16వ తేదీన ఇటలీలోని మీలాన్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. ఇంతకీ ఆ ఫోన్ ఏంటయ్యా అంటే వన్ ప్లస్ నార్డ్ 4. అయితే ఈ ఫోన్ గురించి ఇంకా ఏ వివరాలు బయటకు రాలేదు కాని లీకైన వివరాల ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వన్ ప్లస్ నార్డ్ 4 మెటల్ బాడీ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లు పుదీనా మరియు తెలుపు, వెండి, రంగులలో ఉంటాయట. అలాంటి ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే ఇది స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 Soc అందించబడుతోంది. మొబైల్ డిస్ప్లే విషయానికొస్తే 6.74" 1.5k 120Hz Oled స్క్రీన్ కలిగి ఉంది. అలాగే బ్యాటరీ విషయానికొస్తే 5500mAh బ్యాటరీ కలిగి, 100W చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే.. 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ మరియు అల్ట్రా వైడ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అంతేకాకుండా యూఎస్బీ టైప్ సి పోర్టును కలిగి ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, IP65 రేటింగ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక దీని ధర కూడా చాలా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.